వైమానిక దాడులు ప్రారంభించిన బ్రిటన్
లండన్: సిరియాలోని ఐఎస్ స్థావరాలపై బ్రిటన్ వైమానిక దాడులు నిర్వహించింది. సిరియాలో దాడులు జరపడానికి బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలిపిన కొన్ని గంటల్లోనే ఐఎస్ స్థావరలపై రాయల్ బ్రిటీష్ ఎయిర్ ఫోర్స్ విరుచుకుపడటం విశేషం. ఈ దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ కు చెందిన పలు స్థావరాలు ద్వంసమైనట్లు తెలుస్తోంది. మధ్యయుగపు రాక్షసులపై బాంబుల వర్షం కురిపించాలని కామెరాన్ ఇచ్చిన పిలుపు.. పార్లమెంట్లో 397-223 ఓట్ల తేడాతో బుధవారం ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.
గతంలో కూడా సిరియాలోని అల్ బషర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు నిర్వహించాలని కామెరూన్ భావించినా 2013లో అతని వాదన పార్లమెంట్లో ఆమోదం పొందలేదు. అయితే ఇటీవల పారిస్ దాడుల నేపథ్యంలో ఉగ్రవాదులను తుదముట్టించాలనే ఆలోచనకు బ్రిటన్ పార్లమెంట్ అంగీకారం తెలిపింది.