ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఉత్తర వాజిరిస్థాన్ ప్రాంతంలో మంగళవారం జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడుల్లో ఉగ్రవాదుల ఆరు రహస్య స్థావరాలను ధ్వంసం చేశారు.
ఉగ్రవాదులను హతమార్చడానికి జూన్ 15న జర్బ్-ఐ-ఆజ్బ్ మిలటరీ ఆపరేషన్ను ప్రారంభించిన తర్వాత 400 మందికిపైగా చంపినట్టు పాక్ పత్రిక వెల్లడించింది. హతమైన ఉగ్రవాదుల్లో ఎక్కువగా విదేశీయులున్నట్టు వెల్లడించింది. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంపై ఉగ్రవాదదాడి జరిగిన తర్వాత ఈ ఆపరేషన్ ను ప్రారంభించారు.
వైమానిక దాడుల్లో 30 మంది ఉగ్రవాదుల హతం
Published Tue, Aug 5 2014 3:52 PM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM
Advertisement
Advertisement