19మంది ఉగ్రవాదులు హతం | 19 terrorists killed in Russian airstrikes in Syria | Sakshi
Sakshi News home page

19మంది ఉగ్రవాదులు హతం

Published Wed, Oct 7 2015 8:37 AM | Last Updated on Sun, Sep 3 2017 10:35 AM

19 terrorists killed in Russian airstrikes in Syria

బీరుట్: ముందుగా చెప్పినట్లుగానే రష్యా సేనలు ఉగ్రవాదుల భరతం పట్టడం ప్రారంభించాయి. సిరియాలో రష్యా సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో 19మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హతమయ్యారు. పలువురు గాయాలపాలయ్యారు. సిరియాలోని తూర్పు ప్రాంతాలైన రఖా ప్రావిన్స్, పురాతన నగరం పామిరాపై రష్యా వైమానిక బలగాలు దాడులు నిర్వహించాయి.

దీంతో రఖాలో 15మంది, పామిరాలో నలుగురు ఉగ్రవాదులు చనిపోయారు. దీంతోపాటు ఉగ్రవాదులకు చెందిన పన్నెండు వాహనాలు, వారి స్థావరాలు ధ్వంసమయ్యాయి. గత సెప్టెంబర్ 30 నుంచి సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ స్థావరాలను ధ్వంసం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement