హుదైదా: యెమెన్‌లోని హుదైదా నగరంలో ఉన్న హౌతీ తిరుగుబాటుదారులపై సౌదీ నేతృత్వంలోని సంకీర్ణసేనలు విరుచుకుపడ్డాయి. నగరంలోని స్థావరాలపై శని, ఆదివారం జరిపిన దాడుల్లో తొమ్మిది మంది అనుచరులు సహా 61 మంది హౌతీ తిరుగుబాటుదారుల్ని హతమార్చాయి. ఈ దాడుల్లో గాయపడ్డ పలువురిని అధికారులు మోఖా నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 2014లో ఇరాన్ మద్దతుతో హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్ ప్రభుత్వాన్ని కూలదోశారు. పదవీచ్యుతుడైన అధ్యక్షుడు మన్సూర్ హాదీకి మద్దతుగా సౌదీఅరేబియా నేతృత్వంలోని యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, ఈజిప్ట్, జోర్డాన్‌ల సంకీర్ణ సేనలు ఉగ్రవాదులపై దాడులు ప్రారంభించాయి.
Comments
Please login to add a commentAdd a comment