coalitions
-
కర్ణాటకలో పొత్తులపై అమిత్ షా కీలక ప్రకటన
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు వివిధ పార్టీలు పొత్తులపై కసరత్తు చేపట్టాయి. అయితే, అధికార బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోదని కుండబద్దలు కొట్టారు కేంద్రం హోంమంత్రి అమిత్ షా. రాష్ట్రంలో మూడింట రెండొంతులు మెజారిటీ సాధించి అధికారం చేపట్టేందుకు పార్టీ కార్యకర్తలు కష్టపడాలని సూచించారు. జేడీ(ఎస్)కి ఓటేస్తే అది కాంగ్రెస్‌కు వేసినట్లేనని చెప్పారు. 2023లో పార్టీ ఒంటరిగానే బరిలో నిలుస్తుందన్నారు. ‘కర్ణాటకలో ఈసారి త్రిముఖ పోరు ఉంటుందని జర్నలిస్టులు చెబుతున్నారు. కానీ, నేను ఈసారి ముఖాముఖి పోటీనే ఉండబోతుందని అంటున్నా. ఎందుకంటే జేడీఎస్‌కు ఓటేసినా అది కాంగ్రెస్‌కు వేసినట్లే అవుతుంది. బీజేపీ నేతృత్వంలోని దేశభక్తులకా? దేశాన్ని విభజించే కాంగ్రెస్ నేతృత్వంలోని తుక్డే తుక్డే గ్యాంగ్‌కా? ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో ప్రజలే తేల్చుకోవాలి.’అని ప్రజలను కోరారు అమిత్ షా. బీజేపీ తమతో పొత్తు పెట్టుకోబోతోందటూ జేడీఎస్ అసత్య ప్రచారాలు చేస్తోందని విమర్శించారు షా. ఒంటరిగానే పోటీ చేసి ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: భారత్‌లో ఉండాలని లేదా? ‘వాట్సాప్’కి కేంద్రం హెచ్చరిక! -
యెమెన్‌లో దాడులు, 61 మంది మృతి
హుదైదా: యెమెన్‌లోని హుదైదా నగరంలో ఉన్న హౌతీ తిరుగుబాటుదారులపై సౌదీ నేతృత్వంలోని సంకీర్ణసేనలు విరుచుకుపడ్డాయి. నగరంలోని స్థావరాలపై శని, ఆదివారం జరిపిన దాడుల్లో తొమ్మిది మంది అనుచరులు సహా 61 మంది హౌతీ తిరుగుబాటుదారుల్ని హతమార్చాయి. ఈ దాడుల్లో గాయపడ్డ పలువురిని అధికారులు మోఖా నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 2014లో ఇరాన్ మద్దతుతో హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్ ప్రభుత్వాన్ని కూలదోశారు. పదవీచ్యుతుడైన అధ్యక్షుడు మన్సూర్ హాదీకి మద్దతుగా సౌదీఅరేబియా నేతృత్వంలోని యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, ఈజిప్ట్, జోర్డాన్‌ల సంకీర్ణ సేనలు ఉగ్రవాదులపై దాడులు ప్రారంభించాయి. -
కన్నడ ‘స్థానికం’లో కాంగ్రెస్ జోరు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. మొత్తం 2,662 స్థానాల్లో ఫలితాలు వెల్లడవగా.. కాంగ్రెస్ 982 స్థానాలను, బీజేపీ 929 స్థానాలను సాధించాయి. జేడీఎస్ 375 సీట్లలో గెలవగా.. ఇండిపెండెంట్లు ఇతర చిన్న పార్టీలు కలిసి 376 స్థానాల్లో ఇతరులు పాగా వేశారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య సీట్ల తేడా స్వల్పంగానే ఉంది. అయితే సంకీర్ణ కూటమిలో భాగస్వామిగా ఉన్న జేడీఎస్‌తో కలిసి మెజారిటీ పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ)పై కాంగ్రెస్ పట్టుదక్కించుకోనుంది. 3 సిటీ కార్పొరేషన్లు, 29 సిటీ మునిసిపల్ కార్పొరేషన్లు, 52 పట్టణ మునిసిపాలిటీలు, 20 పట్టణ పంచాయతీల్లోని 2,709 స్థానాలకు శనివారం ఎన్నికలు జరిగాయి. సోమవారం కౌంటింగ్ అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం 2,662 స్థానాల్లో ఫలితాలను వెల్లడించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప సొంత జిల్లా షిమోగాలో బీజేపీ పూర్తి ఆధిపత్యం కనబరచగా.. మిగిలిన చోట్ల నువ్వా, నేనా అన్నట్లుగానే పోటీ నెలకొంది. మొత్తం 29 నగర సభల్లో బీజేపీ 10 కార్పొరేషన్లను గెల్చుకోగా, కాంగ్రెస్‌కు 5, జేడీఎస్‌కు 3 దక్కాయి. మెజార్టీ ‘జేడీఎస్+కాంగ్రెస్’దే సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములైన జేడీఎస్, కాంగ్రెస్‌లు ఈ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేశాయి. ఎన్నికల తర్వాత పొత్తు కొనసాగుతుందని ముందుగానే ప్రకటించాయి. ఈ లెక్క ప్రకారం జేడీఎస్, కాంగ్రెస్‌ల కూటమి ఖాతాలో మొత్తం 1,357 స్థానాలు చేరాయి. దీంతో మెజారిటీ మునిసిపాలిటీల్లో బీజేపీ కన్నా ఈ కూటమిదే ఆధిపత్యం కానుంది. ‘బీజేపీకి అధికారం దక్కకుండా ఉండేందుకు అవసరమైన చోట సంకీర్ణంలో చేరేందుకు మేం సిద్ధమే’ అని మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్డీ దేవెగౌడ పేర్కొన్నారు. ఇవి లోక్‌సభ ఎన్నికలకు దిక్సూచి కాదన్నారు. ఈ ఎన్నికలను కన్నడ ప్రభుత్వం పనితీరుపై రెఫరెండంగా, 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఓటరు నాడిని తెలుసుకునే ప్రయత్నంగా భావించారు. అయితే దాదాపుగా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే రిపీట్ అయ్యాయి. 2013 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే బీజేపీ చాలా పుంజుకుంది. కర్ణాటకలో మొత్తం 4,976 యూఎల్బీ స్థానాలుండగా.. మిగిలిన 2,267 చోట్ల వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల వరదలతో అతలాకుతలమైన కొడగులో ఎన్నికలను వాయిదా వేశారు. విమర్శలకు చెంపపెట్టు: సీఎం ‘సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలున్నాయని, ప్రభుత్వం బలహీనంగా ఉందని, సర్కారు త్వరలోనే కూలిపోతుందని దుష్ప్రచారం చేస్తున్న వారికి ఈ ఫలితాలు చెంపపెట్టు’ అని సీఎం కుమారస్వామి పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ బలహీనపడిందని వస్తున్న విమర్శలకు ఈ ఫలితాలు సరైన సమాధానమని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దినేశ్ గుండూరావ్ వ్యాఖ్యానించారు. అయితే ఫలితాలు తమ పార్టీ ఊహించిన రీతిలో లేవని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప పేర్కొన్నారు. అయితే ఓవరాల్‌గా చూస్తే ఫలితాలు సంతృప్తికరంగానే ఉన్నాయన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 28 లోక్‌సభ ఎన్నికల్లో 22, 23 స్థానాల్లో విజయఢంకా మోగిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో స్థానిక అంశాలే ప్రభావితం చేస్తాయ ని రాష్ట్ర ప్రభుత్వం ప్రభావం ఉండదన్నారు. విజయోత్సవ ర్యాలీపై యాసిడ్ దాడి స్థానిక సంస్థల ఫలితాల నేపథ్యంలో తుమకూరులో విజయం సాధించిన అభ్యర్థిపై యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో 9 మంది ఆయన మద్దతుదారులతోపాటు దాడికి పాల్పడిన ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. తుమకూరు వార్డు నంబర్ 16లో కాంగ్రెస్ అభ్యర్థి ఇనాయతుల్లా ఖాన్ గెలిచారు. దీంతో పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనంలో నుంచి ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి ర్యాలీ వాహనంపై యాసిడ్ చల్లాడు. దీంతో ఇనాయతుల్లా ఖాన్ ముఖంపై గాయాలయ్యాయి. గాయపడిన ఆయన అనుచరులకూ వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్సనందించారు. ఎన్నికల్లో ఖాన్ ప్రత్యర్థులే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ దిశగా విచారణ కొనసాగిస్తున్నారు. -
ప్రతిపక్షం ఖాళీ!
♦ గులాబీ గూటికి తెలుగు తమ్ముళ్లు ♦ బల్దియా విజయంతో సంచలనం ♦ ఒంటి చేత్తో జిల్లాను శాసిస్తున్న మహేందర్ ♦ రెండేళ్ల ‘కారు’ ప్రయాణం ఉద్యమమే ఊపిరిగా.. రాష్ట్ర సాధనే లక్ష్యంగా పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) జిల్లాలో బలీయశక్తిగా అవతరించింది. ప్రతిపక్షాలను ఉనికి కే పరిమితం చేసి.. గ్రేటర్లో అఖండ విజయంతో విమర్శకుల నోళ్లకు తాళం వేసింది. రెండేళ్ల క్రితం అస్థిత్వం కోసం పాకులాడిన టీఆర్ఎస్.. ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తోంది. సాక్షి , రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కేసీఆర్ రాజకీయ వ్యూహాలకు జిల్లాలో సమీకరణలు మారిపోయాయి. ఆపరేషన్ ఆకర్ష్‌తో టీడీపీ దాదాపుగా ఖాళీ అయింది. పచ్చపార్టీలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మినహా మిగతా ఆరుగురు గూలాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఏకైక టీటీడీపీ ఎంపీ చామకూర మల్లారెడ్డి కూడా తాజాగా కారెక్కారు. కాంగ్రెస్ పార్టీది కూడా పరిస్థితి దాదాపుగా ఇంతే. ఆ పార్టీకి చెందిన ఇరువురి ఎమ్మెల్యేల లో కాలె యాదయ్య (చేవెళ్ల) ఏడాదిన్నర క్రితమే గులాబీ గూటికి చేరారు. ఇక మిగిలిన పరిగి శాసనసభ్యుడు రామ్మోహన్‌రెడ్డి కూడా ఎప్పుడో ఒకసారి అధికారపార్టీ ఆకర్షణలో పడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీకి కంచుకోటకు బీటలు వారేలా చేయడం.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించడంతో ప్రతిపక్ష పార్టీలన్నీ కకావికలమయ్యాయి. గ్రేటర్లో విజయంతో కేవలం గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైందనే అపవాదును చెరిపివేసింది. ఆరు నెలల క్రితం జరిగిన మండలి ఎన్నికల్లోనూ రెండు స్థానాలను గెలుచుకోగలిగింది. తగిన సంఖ్యాబలం లేకున్నా, విపక్షాలన్నీ కూటమిగా మారినా.. తమదైన శైలిలో పావులు కదిపి రెండు సీట్లను సునాయాసంగా కైవసం చేసుకుంది. చక్రంతిప్పిన మహేందర్‌రెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ అజేయశక్తిగా మారడానికి ప్రధాన కారణం మంత్రి మహేందర్‌రెడ్డి అనేది నిర్వివాదాంశం. స్థానిక సంస్థల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు సరిపడా బలం ఉన్నా మహేందర్ ఎత్తుల ముందు ఆ పార్టీల పాచిక పారలేదు. జిల్లా పరిషత్‌లోనూ ఇదే తరహా పావులను కదిపి విజయం సాధించిన టీఆర్ఎస్.. జిల్లాలో వ్యూహాత్మకంగా ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసింది. ప్రతిపక్షాల్లోని అనైక్యతను సొమ్ము చేసుకోవడం.. స్వపక్షంలోని అసమ్మతిని రాజీ చేసుకోవడం ద్వారా జిల్లా రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా అవతరించారు. ఒంటి చేత్తో జిల్లా రాజకీయాలను శాసిస్తున్న మహేందర్.. పార్టీ నిర్ణయాల్లో కీలకభూమిక పోషిస్తున్నారు. పార్టీ పదవులు మొదలు.. నామినేటెడ్ పదవుల పంపకం వరకు ఆయన కనుసన్నల్లో నడుస్తున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీని వీడి గులాబీ గూటికి చేరిన తెలుగు తమ్ముళ్లు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. పద వుల వడ్డనలో తమ ప్రాధాన్యం తగ్గకుండా.. నిధుల కేటాయింపుల్లో వివక్ష లేకుండా పనులు కానిచ్చేసుకుంటున్నారు. అధికారపార్టీలో నివురు గప్పిన నిప్పులా అసమ్మతి ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో అసంతృప్తిని బయటకు వెళ్లగక్కే సాహసం నేతలు చేయడంలేదు. పాత, కొత్త నేతల మధ్య అంతర ం కొనసాగుతునే ఉంది. నామినేటెడ్ పదవుల వ్యవహారంలోనూ వైరివర్గాల నడుమ లుకలుకలు సాగుతునే ఉన్నాయి. ఇలాంటి స్పీడ్ బ్రేకర్లు అక్కడక్కడా ఉన్నా.. కారు దూకుడు మాత్రం తగ్గడంలేదు.