వాషింగ్టన్: ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ ప్రయోగించిన రెండు యాంటి షిప్ బాలిస్టిక్ మిసైళ్లను కూల్చివేసినట్లు అమెరికా మిలిటరీ ప్రకటించింది. ఈ మిసైళ్లను హౌతీ రెబెల్స్ యెమెన్ నుంచి ప్రయోగించినట్లు తెలిపింది. గడిచిన మూడు రోజుల్లో హౌతీ మిలిటెంట్ల మిసైళ్లను అమెరికా మిలిటరీ కూల్చివేయడం ఇది రెండోసారి.
‘ఎర్ర సముద్రంలో తమపై దాడులు జరుగుతున్నాయని డెన్మార్క్‌కు చెందిన ఒక నౌక మా సాయం కోరింది. దీంతో యూఎస్‌ఎస్ గ్రేవ్‌లీ, యూఎస్‌ఎస్ లాబూన్ అనే రెండు యాంటీ మిసైల్ గన్‌లు స్పందించాయి. షిప్పులపైకి దూసుకువస్తున్న మిసైళ్లను కూల్చివేశాయి’అని అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్ తెలిపింది.
ప్రపంచ వాణిజ్యంలో 12 శాతం ఎర్ర సముద్రం నుంచే జరుగుతుంది. ఇంత కీలక రూట్‌లో వాణిజ్య నౌకలపై హౌతీ రెబెల్స్ దాడులకు దిగుతున్నారు. పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఈ దాడులు చేస్తున్నట్లు మిలిటెంట్లు చెబుతున్నారు. వీరికి ఇరాన్ మద్దతుందని అమెరికా బలంగా నమ్ముతోంది.
ఇదీచదవండి..ట్రంప్ పోరాటం వాటితోనే.. 15 నుంచి ఎన్నికల రేసు స్టార్ట్
Comments
Please login to add a commentAdd a comment