Missile defense system
-
Houthy attacks: రెబెల్స్‌ను మళ్లీ దెబ్బ కొట్టిన అమెరికా
వాషింగ్టన్: ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ ప్రయోగించిన రెండు యాంటి షిప్ బాలిస్టిక్ మిసైళ్లను కూల్చివేసినట్లు అమెరికా మిలిటరీ ప్రకటించింది. ఈ మిసైళ్లను హౌతీ రెబెల్స్ యెమెన్ నుంచి ప్రయోగించినట్లు తెలిపింది. గడిచిన మూడు రోజుల్లో హౌతీ మిలిటెంట్ల మిసైళ్లను అమెరికా మిలిటరీ కూల్చివేయడం ఇది రెండోసారి. ‘ఎర్ర సముద్రంలో తమపై దాడులు జరుగుతున్నాయని డెన్మార్క్‌కు చెందిన ఒక నౌక మా సాయం కోరింది. దీంతో యూఎస్ఎస్ గ్రేవ్లీ, యూఎస్ఎస్ లాబూన్ అనే రెండు యాంటీ మిసైల్ గన్లు స్పందించాయి. షిప్పులపైకి దూసుకువస్తున్న మిసైళ్లను కూల్చివేశాయి’అని అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ప్రపంచ వాణిజ్యంలో 12 శాతం ఎర్ర సముద్రం నుంచే జరుగుతుంది. ఇంత కీలక రూట్లో వాణిజ్య నౌకలపై హౌతీ రెబెల్స్ దాడులకు దిగుతున్నారు. పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఈ దాడులు చేస్తున్నట్లు మిలిటెంట్లు చెబుతున్నారు. వీరికి ఇరాన్ మద్దతుందని అమెరికా బలంగా నమ్ముతోంది. ఇదీచదవండి..ట్రంప్ పోరాటం వాటితోనే.. 15 నుంచి ఎన్నికల రేసు స్టార్ట్ -
భారత్ ఆర్మీకి మరింత పదును.. రష్యా నుంచి ‘ఇగ్లా–ఎస్’..
న్యూఢిల్లీ: రష్యా నుంచి శక్తివంతమైన యాంటీ–ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థ ‘ఇగ్లా–ఎస్’ కొనుగోలుకు రంగం సిద్ధమైంది. ఈ వ్యవస్థ రాకతో భారత్–చైనా, భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో భారత రక్షణ దళాలకు మరింత బలం చేకూరనుంది. ఇగ్లా–ఎస్ కొనుగోలు విషయంలో రష్యా, భారత్ మధ్య ఒప్పందం కుదిరినట్లు రష్యా వార్తా సంస్థ వెల్లడించింది. కాంట్రాక్టుపై రష్యా సంతకం చేసినట్లు తెలియజేసింది. ఆయుధాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని భారత్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ కొన్ని అత్యాధునిక ఆయుధాల కోసం విదేశాలపై ఆధారపడక తప్పడం లేదు. ప్రధానంగా రష్యా నుంచి అధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటోంది. 2018 నుంచి 2022 వరకు భారత్ దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో రష్యా ఆయుధాల వాటా 45 శాతం కాగా, ఫ్రాన్స్ ఆయుధాల వాటా 29 శాతం, అమెరికా ఆయుధాల వాటా 11 శాతంగా ఉంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇగ్లా–ఎస్ యాంటీ–ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థ అవసరాన్ని భారత్ గుర్తించింది. ఏమిటీ ఇగ్లా–ఎస్? - ఇది శత్రు దేశాల యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను కూలి్చవేసే వ్యవస్థ - ఒక వ్యక్తి గానీ, బృందాలు గానీ ఆపరేట్ చేసే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. - తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, హెలికాప్టర్లను సులభంగా నేలకూల్చవచ్చు. - క్రూయిజ్ మిస్సైళ్లు, డ్రోన్లను కూడా కచి్చతంగా గుర్తించి, గాల్లోనే ధ్వంసం చేస్తుంది. - ఒక్కో ఇగ్లా–ఎస్ సిస్టమ్‌లో 9ఎం342 మిసైల్, 9పీ522 లాంచింగ్ మెకానిజమ్, 9వీ866–2 మొబైల్ టెస్టు స్టేషన్, 9ఎఫ్719–2 టెస్టు సెట్ ఉంటాయి. Breaking: Russia and India finalize $1 billion deal for Igla air-defense system, bolstering India's defenses, Russian official quoted by TASS news agency. pic.twitter.com/A5d5cWqH5c — Varun Puri 🇮🇳 (@varunpuri1984) November 14, 2023 -
అవును.. మరోసారి దాడులు.. తిప్పికొట్టామన్న అమెరికా!
కాబూల్/వాషింగ్టన్: ముందుగా హెచ్చరించినట్లుగానే కాబూల్ ఎయిర్‌పోర్టులో ఐదు రాకెట్ దాడులు జరిగినట్లు అమెరికా ధ్రువీకరించింది. అయితే, క్షిపణి వ్యవస్థ ద్వారా వాటన్నింటినీ తిప్పికొట్టామని పేర్కొంది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వ అధికారి ఒకరు రాయిటర్స్‌తో వ్యాఖ్యానించారు. అఫ్గనిస్తాన్‌లోని హమీద్ కర్జాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం జరిగిన రాకెట్ దాడిని తిప్పికొట్టినట్లు పేర్కొన్నారు. సీ- ర్యామ్ డిఫెన్స్ సిస్టం ద్వారా వాటిని నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందన్నారు. కాగా సీ- ర్యామ్ అనేది ఒక ఆటోమేటిక్ సిస్టం. ప్రత్యర్థి దాడులను పసిగట్టి మెషిన్ గన్ ద్వారా వాటిని ఛేదిస్తుంది. ఇరాక్, అఫ్గనిస్తాన్‌లలో ఉన్న అమెరికా బలగాలను రక్షణగా అగ్రరాజ్యం ఈ సిస్టంను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఇక అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాల ఉపసంహరణకు రేపటి(ఆగష్టు 31)తో గడువు ముగియనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే వరుస పేలుళ్లకు పాల్పడి వందలాది మంది అఫ్గన్ ప్రజలతో పాటు 13 మంది అమెరికా సైనికులను బలిగొన్న ఐసిస్- కె(ఇస్లామిక్ స్టేట్- ఖోరసాన్) గ్రూపు మరోసారి దాడులకు తెగబడే అవకాశం ఉందని అగ్రరాజ్యం హెచ్చరించింది. సోమవారం ఈ మేరకు దాడులు జరగడంతో వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు వెల్లడించింది. చదవండి: భయం భయంగానే ఇంటర్వ్యూ: దేశం వీడిన మహిళా జర్నలిస్టు Afghanistan: As many as five rockets were fired at Kabul airport but were intercepted by a missile defense system, reports Reuters quoting a US official — ANI (@ANI) August 30, 2021 -
శుత్రుదుర్భేద్యంగా రాష్ట్రపతి, ప్రధాని విమానాలు
వాషింగ్టన్: అత్యాధునిక క్షిపణి నిరోధక రక్షణ వ్యవస్థలు రెండింటిని భారత్‌కు విక్రయించేందుకు అగ్రరాజ్యం అమెరికా ఆమోదం తెలిపింది. ఈ రెండింటి విలువ సుమారు రూ.1,355 కోట్లుగా ఉండనుంది. ఈ కొనుగోళ్ల ద్వారా రాష్ట్రపతి, ప్రధాని ప్రయాణించే విమానాలకు అత్యంత పటిష్టమైన రక్షణ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్ఫ్రారెడ్ కౌంటర్‌మెజర్స్, సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్‌గా పిలిచే ఈ వ్యవస్థల అమ్మకానికి సంబంధించి ట్రంప్ ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు అమెరికా డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ తెలిపింది. భారత రాష్ట్రపతి, ప్రధాని ప్రయాణించే ఎయిరిండియా వన్ విమానాలకు ఈ ఆధునిక వ్యవస్థలను అమర్చితే అమెరికా అధ్యక్షుడి ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంతో సమానమైన పటిష్టమైన భద్రత కలుగుతుంది. ఈ వ్యవస్థలను అమర్చేందుకు 2 బోయింగ్–777 ఈఆర్ విమానాలను ఎయిరిండియా నుంచి కొననున్నారు. ప్రమాద సమయంలో మధ్యశ్రేణి క్షిపణి వ్యవస్థలపై దానంతటదే ప్రతిదాడి చేయడం ఈ వ్యవస్థ ప్రత్యేకతల్లో ఒకటి. ఈ కొనుగోళ్లలో ప్రధాన కాంట్రాక్టర్ బోయింగ్ కంపెనీ. -
భారత్‌కు ఎస్-400 : ఆందోళనలో అమెరికా
మాస్కో, రష్యా : అత్యాధునిక ఎస్-400 బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను రష్యా నుంచి కొనుగోలు చేయాలన్న భారత్ నిర్ణయంపై అమెరికా మండిపడింది. రష్యా నుంచి క్షిపణి రక్షక వ్యవస్థను కొనుగోలు చేస్తే భారత్-అమెరికా సైనిక సహకారంపై పెను ప్రభావం ఉంటుందని యూఎస్ హౌజ్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్ విలియమ్ థోర్న్‌బెర్రీ హెచ్చరించారు. భారత్ రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడం వల్ల కీలకమైన సాంకేతికతలను భారత్‌కు అమెరికా అందించలేదని చెప్పారు. ఎస్-400ల కొనుగోలుపై పలు స్థాయిల్లో ఆందోళనను వ్యక్తం చేస్తామని పేర్కొన్నారు. ఎస్-400ల అంశంపై అమెరికా పాలనా యంత్రాంగం, కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తోందని వెల్లడించారు. రష్యా నుంచి భారత్ ఎస్-400లను కొనుగోలు చేస్తే అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేసే ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందంపై నీలినీడలు కమ్ముకునే అవకాశం ఉంటుందని చెప్పారు. కాగా, ఏప్రిల్‌లో ట్రంప్.. భారత్‌కు ప్రిడేటర్ డ్రోన్ల ఎగుమతులకు అనుమతి ఇచ్చారు. అయితే క్షిపణి రక్షణ వ్యవస్థను రష్యా నుంచి పొందేందుకు భారత్ 39 వేల కోట్ల రూపాయలు అంచనాతో ఒప్పందం కుదుర్చుకోనుంది. -
చైనా సాహసం : గాల్లోనే కూల్చేసింది
బీజింగ్, చైనా : దేశం వైపు దూసుకొచ్చే అణ్వాయుధ క్షిపణిని కూల్చేవేసే ప్రయోగం విజయవంతమైనట్లు చైనా ప్రకటించింది. సోమవారం జరిగిన ఈ ప్రయోగంలో చైనా తొలుత ఖండాంతర క్షిపణి(ఐసీబీఎం)ని ప్రయోగించింది.. క్షిపణి భూమి వాతావరణం దాటిన అనంతరం రక్షక క్షిపణితో దాన్ని కూల్చివేసింది. అయితే, భారత్ అగ్ని-1 అణ్వాయుధ క్షిపణిని ప్రయోగించిన అనంతరం చైనా ఈ ప్రకటన చేయడం గమనార్హం. అనుకున్న లక్ష్యాలన్నింటిని డిఫెన్స్ సిస్టమ్ అందుకున్నట్లు చైనా రక్షణ శాఖ వెల్లడించింది. ఈ ప్రయోగాన్ని దేశ రక్షణ నిమిత్తం చేసిందే తప్ప ఎవరినీ ఉద్దేశించి కాదని పేర్కొంది. శత్రుదేశాల క్షిపణిని అడ్డగించి గాల్లోనే పేల్చివేయగల సామర్ధ్యం కలిగిన రక్షణ వ్యవస్థను 2010లో డ్రాగన్ దేశం అభివృద్ధి చేసింది. -
అమెరికాతో సౌదీ భారీ ఆయుధ డీల్
-
అమెరికాతో సౌదీ భారీ ఆయుధ డీల్
వాషింగ్టన్: సౌదీ అరేబియాకు అత్యాధునిక టెర్మినల్ హై అల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్(థాడ్) క్షిపణి రక్షణ వ్యవస్థ అమ్మకానికి అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. థాడ్ ఒప్పందం విలువ 15 బిలియన్ డాలర్లు(రూ. 97 వేల కోట్లు) అని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. శక్తివంతమైన రాడార్లు అమర్చిన ఈ థాడ్ క్షిపణులు శత్రు దేశాల క్షిపణుల్ని మధ్యలోనే అడ్డుకుని పేల్చివేస్తాయి. గంటకు 10 వేల కి.మీ వేగంతో ప్రయాణించే థాడ్ క్షిపణులు 150 కిలోమీటర్ల ఎత్తువరకూ ఎగరగలవు. ‘ఈ ఒప్పందం అమెరికా జాతీయ భద్రత, విదేశాంగ విధానాలకు సహకారంగా ఉంటుంది. సౌదీ అరేబియా, గల్ఫ్‌లో ఇరాన్‌తో పాటు ఇతర ప్రాంతీయ ముప్పుల నేపథ్యంలో థాడ్ దీర్ఘకాల రక్షణ వ్యవస్థగా ఉపయోగపడుతుంది’ అని అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే థాడ్‌ను సౌదీ పొరుగు దేశాలైన ఖతర్, యూఏఈలకు అమెరికా సరఫరా చేసింది. అమెరికా ఆయుధ సంపత్తిలో థాట్ అత్యంత సమర్థవంతమైన క్షిపణి రక్షణ వ్యవస్థ. శత్రు క్షిపణుల్ని కచ్చితంగా గుర్తించి పేల్చేందుకు ఇందులో రాడార్ వ్యవస్థలున్నాయి. 20 అడుగుల పొడవుండే థాడ్ క్షిపణులు టన్ను బరువుంటాయి. ఇన్ఫ్రారెడ్ సెన్సర్ల సాయంతో మిస్సైల్‌ను అంచనావేసి పేల్చేస్తుంది. ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమిస్తున్న పాకిస్తాన్ పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని ట్రంప్ నిర్ణయించారు. పాక్‌కు గట్టి హెచ్చరికలు చేసేందుకు విదేశాంగ, రక్షణ శాఖ మంత్రుల్ని పాక్‌కు పంపనున్నారు. ఉగ్రవాదులకు పాక్ స్వర్గధామంగా మారిందని ట్రంప్ తప్పుపట్టడం తెలిసిందే. అమెరికా హెచ్చరించినా పాక్ తీరు మారకపోవడంతో ఈ నెల చివరిలో అమెరికా విదేశాంగ మంత్రి పాక్‌కు వెళ్లనున్నారు. అందుకే ట్రంప్‌తో విడిపోయా న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రేమ, పెళ్లి, విడాకులు సహా పలు ఆసక్తికర అంశాల్ని ఆయన మొదటి భార్య ఇవానా బయటపెట్టారు. ‘రైజింగ్ ట్రంప్’ పేరుతో ఆమె రాసిన పుస్తకంలో ట్రంప్ వివాహేతర సంబంధాల బాగోతాన్ని వివరించారు. 1977లో ట్రంప్‌ను పెళ్లిచేసుకున్న ఇవానా 1992లో విడిపోయారు. ‘మా వివాహ బంధం ముగిసిందని 1989లో∙నాకు అర్థమైంది. ఒక యువతి నా దగ్గరకు వచ్చి తన పేరు మార్లా అని, నా భర్తను ప్రేమిస్తున్నానని చెప్పింది. నేను వెంటనే బయటకు పో.. నేను నా భర్తను ప్రేమిస్తున్నానని గట్టిగా సమాధానమిచ్చాను’ అని పాత సంగతుల్ని పుసక్తంలో ఇవానా గుర్తుచేసుకున్నారు. మార్లా మేపుల్స్‌తో వివాహేతర సంబంధాన్ని 1990లో న్యూయార్క్ పోస్టు పత్రిక ‘బెస్ట్ సెక్స్ ఐ హావ్ ఎవర్ హాడ్’ పేరుతో ప్రకటించడంతో ట్రంప్ విమర్శలు ఎదుర్కొన్నారు. ఇవానాతో విడాకుల తర్వాత 1993లో ట్రంప్ మార్లాను పెళ్లి చేసుకున్నారు. ‘మేమిద్దరం విడిపోయాక పెద్ద కొడుకు డొనాల్డ్ జూనియర్ ఏడాది పాటు తండ్రితో మాట్లాడలేదు. ప్రస్తుతం వారానికోసారి మాట్లాడుకుంటున్నాం. చెక్ రిపబ్లిక్కు రాయబారిగా నాకు చాన్సిచ్చినా వద్దన్నా’ అని పేర్కొన్నారు. -
సూపర్సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
బాలసోర్: తక్కువ ఎత్తులో మన దేశంపైకి వచ్చే ఏ బాలిస్టిక్ శత్రు క్షిపణిని అయినా నాశనం చేయగల సూపర్ సోనిక్ ఇంటర్సెప్టార్ క్షిపణిని భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. దీనిని దేశీయంగా తయారు చేశారు. నెల గడవక ముందే ఈ క్షిపణిని బుధవారం రెండోసారి పరీక్షించారు. భారత్‌కు వివిధ స్థాయుల్లో క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో భాగంగా దీనిని అభివృద్ధి చేశారు. పృథ్విని శత్రు క్షిపణిలా మార్చి సూపర్సోనిక్ ఇంటర్సెప్టార్ క్షిపణికి లక్ష్యంగా నిర్దేశించారు. ఒడిశా చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్)లోని మూడవ క్షిపణి ప్రయోగ వేదిక నుంచి పృథ్విని ఉదయం 10.10 గంటలకు ప్రయోగించారు. బంగాళాఖాతంలోని అబ్దుల్ కలాం దీవిలో ఏఏడీ (అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్) సూపర్ సోనిక్ క్షిపణిని మోహరించారు. పృథ్వి గురించి రాడార్ల ద్వారా సంకేతాలు అందుకున్న ఏఏడీ, గాలిలోనే పృథ్విని అడ్డుకుంది. ‘ప్రయోగం బాగా జరిగింది. పృథ్విని ఏఏడీ నేరుగా ఢీకొట్టింది’అని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. 7.5 మీటర్ల పొడవు ఉండే ఈ క్షిపణిలో దిక్సూచి వ్యవస్థ, అధునాతన కంప్యూటర్, ఒక ఎలక్ట్రో–మెకానికల్ యాక్టివేటర్లు కూడా ఉంటాయని అధికారి పేర్కొన్నారు. ఫిబ్రవరి 11న కూడా ఈ క్షిపణిని ఎక్కువ ఎత్తులో విజయవంతంగా పరీక్షించారు. అంతకుముందు తక్కువ ఎత్తులో 2016 మే 15న జరిపిన పరీక్ష కూడా విజయవంతం అయింది.