ప్రయోగ సందర్భంగా ఐసీబీఎంను అడ్డుకోవడానికి వెళ్తున్న డిఫెన్స్ క్షిపణి
బీజింగ్, చైనా : దేశం వైపు దూసుకొచ్చే అణ్వాయుధ క్షిపణిని కూల్చేవేసే ప్రయోగం విజయవంతమైనట్లు చైనా ప్రకటించింది. సోమవారం జరిగిన ఈ ప్రయోగంలో చైనా తొలుత ఖండాంతర క్షిపణి(ఐసీబీఎం)ని ప్రయోగించింది.. క్షిపణి భూమి వాతావరణం దాటిన అనంతరం రక్షక క్షిపణితో దాన్ని కూల్చివేసింది. అయితే, భారత్ అగ్ని-1 అణ్వాయుధ క్షిపణిని ప్రయోగించిన అనంతరం చైనా ఈ ప్రకటన చేయడం గమనార్హం.
అనుకున్న లక్ష్యాలన్నింటిని డిఫెన్స్ సిస్టమ్ అందుకున్నట్లు చైనా రక్షణ శాఖ వెల్లడించింది. ఈ ప్రయోగాన్ని దేశ రక్షణ నిమిత్తం చేసిందే తప్ప ఎవరినీ ఉద్దేశించి కాదని పేర్కొంది. శత్రుదేశాల క్షిపణిని అడ్డగించి గాల్లోనే పేల్చివేయగల సామర్ధ్యం కలిగిన రక్షణ వ్యవస్థను 2010లో డ్రాగన్ దేశం అభివృద్ధి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment