సౌదీ అరేబియాకు అత్యాధునిక టెర్మినల్ హై అల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్(థాడ్) క్షిపణి రక్షణ వ్యవస్థ అమ్మకానికి అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. థాడ్ ఒప్పందం విలువ 15 బిలియన్ డాలర్లు(రూ. 97 వేల కోట్లు) అని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. శక్తివంతమైన రాడార్లు అమర్చిన ఈ థాడ్ క్షిపణులు శత్రు దేశాల క్షిపణుల్ని మధ్యలోనే అడ్డుకుని పేల్చివేస్తాయి. గంటకు 10 వేల కి.మీ వేగంతో ప్రయాణించే థాడ్ క్షిపణులు 150 కిలోమీటర్ల ఎత్తువరకూ ఎగరగలవు.