న్యూఢిల్లీ: రష్యా నుంచి శక్తివంతమైన యాంటీ–ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థ ‘ఇగ్లా–ఎస్’ కొనుగోలుకు రంగం సిద్ధమైంది. ఈ వ్యవస్థ రాకతో భారత్–చైనా, భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో భారత రక్షణ దళాలకు మరింత బలం చేకూరనుంది. ఇగ్లా–ఎస్ కొనుగోలు విషయంలో రష్యా, భారత్ మధ్య ఒప్పందం కుదిరినట్లు రష్యా వార్తా సంస్థ వెల్లడించింది. కాంట్రాక్టుపై రష్యా సంతకం చేసినట్లు తెలియజేసింది.
ఆయుధాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని భారత్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ కొన్ని అత్యాధునిక ఆయుధాల కోసం విదేశాలపై ఆధారపడక తప్పడం లేదు. ప్రధానంగా రష్యా నుంచి అధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటోంది. 2018 నుంచి 2022 వరకు భారత్ దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో రష్యా ఆయుధాల వాటా 45 శాతం కాగా, ఫ్రాన్స్ ఆయుధాల వాటా 29 శాతం, అమెరికా ఆయుధాల వాటా 11 శాతంగా ఉంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇగ్లా–ఎస్ యాంటీ–ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థ అవసరాన్ని భారత్ గుర్తించింది.
ఏమిటీ ఇగ్లా–ఎస్?
- ఇది శత్రు దేశాల యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను కూలి్చవేసే వ్యవస్థ
- ఒక వ్యక్తి గానీ, బృందాలు గానీ ఆపరేట్ చేసే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్.
- తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, హెలికాప్టర్లను సులభంగా నేలకూల్చవచ్చు.
- క్రూయిజ్ మిస్సైళ్లు, డ్రోన్లను కూడా కచి్చతంగా గుర్తించి, గాల్లోనే ధ్వంసం చేస్తుంది.
- ఒక్కో ఇగ్లా–ఎస్ సిస్టమ్‌లో 9ఎం342 మిసైల్, 9పీ522 లాంచింగ్ మెకానిజమ్, 9వీ866–2 మొబైల్ టెస్టు స్టేషన్, 9ఎఫ్719–2 టెస్టు సెట్ ఉంటాయి.
Breaking: Russia and India finalize $1 billion deal for Igla air-defense system, bolstering India's defenses, Russian official quoted by TASS news agency. pic.twitter.com/A5d5cWqH5c
— Varun Puri 🇮🇳 (@varunpuri1984) November 14, 2023
Comments
Please login to add a commentAdd a comment