సనా: యెమెన్‌లోని హౌతీ మిలిటెంట్ల స్థావరాలపై అమెరికా ఆర్మీ మళ్లీ దాడులు జరిపింది. ఈ విషయాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్(సెంట్‌కామ్) వెల్లడించింది. హౌతీలకు చెందిన యాంటీ షిప్ క్రూయిజ్ మిసైళ్లు, మానవ రహిత ఉపరితల ఓడ, మానవ రహిత జలాంతర్గామిపై దాడులు జరిపినట్లు తెలిపింది.
‘ఎర్ర సముద్రంలో అమెరికాకు చెందిన వాణిజ్య నౌకలు, ఇతర దేశాల మధ్య సముద్ర రవాణాకు హౌతీల నుంచి పెను ముప్పు పొంచి ఉంది. హౌతీలు తొలిసారిగా మానవరహిత జలాంతర్గాములను వాడుతున్నారు. ఎర్ర సముద్ర రవాణాను రక్షించేందుకే హౌతీ స్థావరాలపై ఆత్మరక్షణ దాడులు చేశాం’అని సెంట్‌కామ్ అధికారులు తెలిపారు.
పాలస్తీనాకు మద్దతుగా కేవలం ఇజ్రాయెల్ నౌకలపైనే దాడులు చేస్తామని తొలుత ప్రకటించిన హౌతీలు ఎర్ర సముద్రం నుంచి వెళ్లే అమెరికా,బ్రిటన్‌తో పాటు ఇతర దేశాల వాణిజ్య నౌకలపైనా దాడులు చేస్తున్నారు. దీంతో ఆసియా నుంచి అమెరికా వెళ్లే వాణిజ్య నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment