వాషింగ్టన్: ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నహౌతీ గ్రూపు మిలిటెంట్లకు అమెరికా, బ్రిటన్ సంయుక్త దళాలు షాక్ ఇచ్చాయి. హౌతీలకు చెందిన డజన్ల కొద్దీ డ్రోన్‌లను శనివారం రాత్రి కూల్చివేసినట్లు అమెరికా మిలిటరీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘హౌతీలకు చెందిన 28 దాకా అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్స్(యూఏవీ)ను ఎర్ర సముద్రంలో తాజాగా కూల్చివేశాం.
హౌతీల దాడిలో అమెరికా సంయుక్త దళాల నౌకలతో పాటు వాణిజ్య నౌకలకు ఎలాంటి నష్టం జరగలేదు’ అని అమెరికా సెంట్రల్ కమాండ్(సెంట్ కామ్) వెల్లడించింది. శనివారం ఉదయం అమెరికా డెస్ట్రాయర్ నౌకలు, వాణిజ్య కార్గో నౌకల మీద 37 డడ్రౌన్‌లతో పెద్ద ఎత్తున హౌతీలు దాడికి దిగాయి. దీనికి ప్రతిగా రంగంలోకి దిగిన అమెరికా సంయుక్త దళాలు హౌతీల డ్రోన్‌లను కూల్చివేశాయి.
కాగా, ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా హౌతీలు ఎర్ర సముద్రంలోని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ వద్ద అమెరికా, ఇజజ్రాయెల్‌లకు చెందిన వాణిజ్య నౌకలపై డ్రోన్‌లు, మిసైళ్లతో దాడులు చేస్తున్నారు. ఈ దాడులు గత ఏడాది నవంబర్ నుంచి మొదలయ్యాయి. వీటిని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సంయుక్త దళాలు తిప్పికొడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment