టోక్యో : ఎట్టకేలకు షిబుయా మిరైకి పౌరసత్వం కల్పిస్తూ జపాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతకీ షిబు మనిషి మాత్రం కాదు. కంటికీ కనిపించడు. ప్రజలతో మమేకం అయ్యేందుకు మైక్రోసాఫ్ట్ సహాకారంతో అక్కడి సాంకేతిక నిపుణులు ఏఐ పేరిట సృష్టించిన ఓ పాత్ర మాత్రమే.
మిరాని అంటే జపనీస్ భాషలో భవిష్యత్తు అని అర్థం. భౌతికంగా లేని ఆ పాత్ర వర్చ్యువల్ ఎఫెక్ట్స్ తో మనుషులతో మాట్లాడుతుంది. లైన్(జపాన్‌లోని ఓ సోషల్ మీడియా యాప్)లో ఛాటింగ్ కూడా చేస్తుంది. జపాన్‌లోనే కాదు.. ప్రపంచంలోనే తొలి కృత్రిమ ఇంటెలిజెన్స్ బోట్‌గా ఇది గుర్తింపు పొందింది.
ప్రజలతో మాట్లాడటం దానికి ఇష్టం. ఎవరైనా దానితో మాట్లాడొచ్చు. వారి సమస్యలను అర్థం చేసుకుని అది స్పందించి సలహాలు ఇస్తుంది. ప్రజలు పంపే సెల్ఫీలకు అది మార్పులు చేసి పంపుతుంది. అందుకే దానిని ప్రత్యేకంగా గుర్తించాం అని అధికారులు చెబుతున్నారు. ఇకపై షిబుయ టోక్యో వాసి. అంతేకాదు ఏడేళ్ల ఓ చిన్నారి ఫోటోతో కూడిన నివాస పత్రంను దానికి ప్రకటించారు కూడా.
Comments
Please login to add a commentAdd a comment