bot
-
టెస్లా రోబో.. అచ్చం మనిషి తరహాలోనే!
Tesla Bot: ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు టెస్లా.. సంచలన ప్రకటన చేసింది. హ్యూమనాయిడ్ రోబోలను మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. గురువారం(ఆగష్టు 19న) టెస్లా అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) డే జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్లో రోబో ఫీచర్స్‌ను సర్ప్రైజ్ లాంఛ్ చేసి ఆశ్చర్యంలో ముంచెత్తాడు టెస్లా సీఈవో ఎలన్ మస్క్. ప్రస్తుతం టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ కోసం ఉపయోగిస్తున్న ఏఐనే.. హ్యూమనాయిడ్ రోబోలకు ఉపయోగించబోతున్నారు. సుమారు 5.8 అడుగుల ఎత్తు, 125 పౌండ్ల బరువుతో రోబోను తయారు చేయనున్నారు. రోబో ముఖంలోనే పూర్తి సమాచారం కనిపించేలా డిస్ప్లే ఉంచారు. రోబోకు 45 నుంచి 150 పౌండ్ల బరువు మోసే సామర్థ్యం ఉంటుందని, గంటకు ఐదు మైళ్ల దూరం ప్రయాణిస్తుందని చెప్పాడు ఎలన్ మస్క్. చదవండి: టెస్లాకు షాక్ ఇవ్వనున్న ఓలా మనిషి రోబో తరహా డ్యాన్స్‌తో ప్రారంభమైన ఈ ఈవెంట్లో.. గతంలోలాగే హ్యూమనాయిడ్ రోబో ఫీచర్స్ గురించి స్వయంగా మస్క్ వివరణ ఇచ్చాడు. ఇక ఈ రోబోల కోసం ఇప్పుడు వెహకిల్స్ కోసం ఉపయోగిస్తున్న.. ఆటోపైలోట్ సాఫ్ట్వేర్(ఏఐ)ను ఉపయోగించబోతున్నట్లు మస్క్ తెలిపాడు. ఈ న్యూరల్ నెట్వర్క్ ఎనిమిది కెమెరాలతో పని చేస్తుంది. మనిషికి ‘ఆర్థిక భారాన్ని దించే రోబోలుగా’ వీటిని అభివర్ణించాడు మస్క్. మిగతా రోబోల కంటే భిన్నంగా.. మనిషి తరహా ఆకారంలో ఈ రోబో ఉండడం విశేషం. ‘చక్రాల మీదే కాదు.. రెండు కాళ్ల మీద కూడా టెస్లా ఏఐ అద్భుతంగా పని చేస్తుంది. ఇది నా గ్యారెంటీ’ అంటూ రోబో ఆవిష్కరణలో ఉద్వేగంగా మాట్లాడాడు మస్క్. కాగా, ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ రోబోలు.. వచ్చే ఏడాదికల్లా మార్కెట్లోకి రానున్నాయి. Join us to build the future of AI → https://t.co/Gdd4MNet6q pic.twitter.com/86cXMVnJ59 — Tesla (@Tesla) August 20, 2021 -
ప్రాణం లేకపోయినా ఫీలింగ్స్ ఉన్నాయ్
టోక్యో : ఎట్టకేలకు షిబుయా మిరైకి పౌరసత్వం కల్పిస్తూ జపాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతకీ షిబు మనిషి మాత్రం కాదు. కంటికీ కనిపించడు. ప్రజలతో మమేకం అయ్యేందుకు మైక్రోసాఫ్ట్ సహాకారంతో అక్కడి సాంకేతిక నిపుణులు ఏఐ పేరిట సృష్టించిన ఓ పాత్ర మాత్రమే. మిరాని అంటే జపనీస్ భాషలో భవిష్యత్తు అని అర్థం. భౌతికంగా లేని ఆ పాత్ర వర్చ్యువల్ ఎఫెక్ట్స్ తో మనుషులతో మాట్లాడుతుంది. లైన్(జపాన్‌లోని ఓ సోషల్ మీడియా యాప్)లో ఛాటింగ్ కూడా చేస్తుంది. జపాన్‌లోనే కాదు.. ప్రపంచంలోనే తొలి కృత్రిమ ఇంటెలిజెన్స్ బోట్‌గా ఇది గుర్తింపు పొందింది. ప్రజలతో మాట్లాడటం దానికి ఇష్టం. ఎవరైనా దానితో మాట్లాడొచ్చు. వారి సమస్యలను అర్థం చేసుకుని అది స్పందించి సలహాలు ఇస్తుంది. ప్రజలు పంపే సెల్ఫీలకు అది మార్పులు చేసి పంపుతుంది. అందుకే దానిని ప్రత్యేకంగా గుర్తించాం అని అధికారులు చెబుతున్నారు. ఇకపై షిబుయ టోక్యో వాసి. అంతేకాదు ఏడేళ్ల ఓ చిన్నారి ఫోటోతో కూడిన నివాస పత్రంను దానికి ప్రకటించారు కూడా. -
ఎక్కడ పడితే అక్కడ ఇక చెల్లదు
♦ మార్గదర్శకాలతో నూతన పార్కింగ్ పాలసీ ♦ ప్రైవేటు పార్కింగ్‌కు రాయితీలు, ప్రోత్సాహకాలు ♦ ఆస్తిపన్నులో మినహాయింపు.. భవనం ఎత్తు పెంచుకునే వెసులుబాటు ♦ నివాస, ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో పార్కింగ్‌కు కొత్త నిబంధనలు ♦ నూతన విధానం అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం.. ఆఫ్‌స్ట్రీట్ పార్కింగ్ లాట్స్‌కు ప్రోత్సాహకాలు బీవోటీ విధానంలో ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో పార్కింగ్ లాట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం ఖాళీ స్థలాల్లో పార్కింగ్, మల్టీ లెవల్ పార్కింగ్ సదుపాయాలు కల్పించే వారికి పార్కింగ్ నిర్వహణ లైసెన్స్‌ల జారీ. పార్కింగ్ సదుపాయం కల్పించే వ్యక్తులకు అంతే స్థల పరిమాణంతో 100 శాతం టీడీఆర్ హక్కులు కల్పిస్తారు. జోన్ల నిబంధనలను సడలించి వాణిజ్య ఉపయోగాలకు అనుమతిస్తారు. పార్కింగ్‌కు మల్టిపుల్ ఫ్లోర్లను కేటాయిస్తే భవన ఎత్తు విషయంలో నిబంధనల సడలింపు. నిర్ణీత కాలం పాటు పార్కింగ్‌కు స్థలం కేటాయిస్తే 100 శాతం ఆస్తి పన్ను మినహాయింపు. 100 శాతం భవన నిర్మాణ రుసుం మినహాయింపు . సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం, రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాలను అభివృద్ధి పరచడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ‘పార్కింగ్ పాలసీ’ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలోని నగర, పట్టణ ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తుండగా వాహనాల పార్కింగ్ సదుపాయం మాత్రం పరిమితం ఉంది. దీంతో రోడ్లు, వీధుల్లో వాహనాల అక్రమ పార్కింగ్ సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర పట్టణ ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయాలను పెంపొందించేందుకు కొత్త మార్గదర్శకాలతో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ తాజాగా ఈ పాలసీని ప్రకటించింది. అందులోని ముఖ్యాంశాలివీ.. నివాస ప్రాంతాల్లో పార్కింగ్ ఇలా.. నివాస ప్రాంతాల్లో వాహనాలను రోడ్ల వెంట పార్కింగ్‌కు అనుమతించరు. పార్కింగ్ ఏర్పాట్లు ప్రోత్సహించేందుకు బిల్డింగ్ బైలాస్ అమలు చేస్తారు. ప్రైవేట్ ఆఫ్‌స్ట్రీట్ ప్రాంతాల్లో పార్కింగ్‌ను ప్రోత్సహించేలా భవన నిర్మాణ అనుమతుల్లో మార్పులు. ప్రైవేట్ పార్కింగ్‌లను ప్రోత్సహించేందుకు ఆస్తిపన్ను చెల్లింపులో మినహాయింపు. పార్కింగ్‌ల కోసం నిర్మాణాలు చేసే వారికి ఆ మేరకు భవనం ఎత్తు పెంచుకునే వెసులుబాటు. ఫ్లాట్ల యజమానులు, సందర్శకులు ఆన్‌స్ట్రీట్ రోడ్లపై పార్కింగ్ చేయడంపై నిషేధం. ప్రభుత్వ కార్యాలయాలు, థియేటర్లు తదితర ప్రాంతాల్లో... విద్యా సంస్థలు, పరిశ్రమలు, వాణిజ్య కాంప్లెక్సులు, సినిమా థియేటర్లు, కల్యాణ మండపాలు, వినోద కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు తమ సిబ్బంది, సందర్శకులకు ఆఫ్‌స్ట్రీట్ పార్కింగ్ సదుపాయం కల్పించాలి. వివిధ సంస్థలు తమ ఉద్యోగులు, సందర్శకుల అవసరాలకు తగినంతగా పార్కింగ్ సదుపాయం కల్పించాలి ఆయా సంస్థల్లో పార్కింగ్ సదుపాయాలు చాలని వారికి రోడ్లపై పార్కింగ్‌ను అనుమతించరు. ∙పని వేళల తర్వాత పార్కింగ్ సదుపాయాలు కల్పించే సంస్థలను ప్రోత్సహిస్తారు. భారీ వాహనాల పార్కింగ్ ఇలా... బస్సులు, ట్రక్కులు, ఓమ్ని బస్సులు, టూరిస్టు బస్సులు, వ్యాన్లు, వాటర్ ట్యాంకర్లు, కంటైనర్ లారీలు రాత్రిళ్లు మేజర్ రోడ్లపై పార్కింగ్ చేయడాన్ని అనుమతించరు. వాటికోసం ప్రత్యేకంగా ఆఫ్‌స్ట్రీట్ పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తారు. వినియోగంలో లేని వాహనాలను కూడా అక్కడ పార్కింగ్ చేయవచ్చు. ∙తగిన ఫీజులతో నిర్దేశిత ప్రాంతాల్లో ప్రైవేట్ వాహనాలు రాత్రంతా పార్కింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తారు. క్యాబ్స్, బస్సులు, ట్రక్కులు వాణిజ్య కార్యకలాపాల లైట్ వెహికల్స్‌ను రాత్రివేళల్లో నివాస ప్రాంతాల్లో పార్కింగ్‌కు అనుమతించరు. బస్, రైల్వే స్టేషన్లలో... సబర్బన్ రైల్వే, ఎంఎంటీఎస్, మెట్రోస్టేషన్లు, ఆర్టీసీ బస్ టెర్మినల్స్ వద్ద ప్రయాణికుల కోసం పార్కింగ్ సదుపాయాలు మెరుగుపరచాలి. అవసరమైతే ఈ ప్రాంతాల్లో ప్రైవేటు పార్కింగ్ సదుపాయాన్ని ప్రోత్సహించాలి. -
మనకు ఉద్యోగాలిచ్చే రోబోలు వచ్చాయి
న్యూయార్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేథస్సు)తో పనిచేసే రోబోలు మానవుల ఉద్యోగాలను కొల్లగొడుతున్నాయని గోల చేస్తున్నవారు నేడు ఎందరో ఉన్నారు. కానీ ఇందుకు విరుద్ధంగా మానవులకు ఉద్యోగాలిస్తున్న రోబోలు నేడు మార్కెట్లోకి వచ్చాయంటే ఆశ్చర్యం వేస్తోంది. ‘మ్యా సిస్టమ్స్’ అనే స్టార్టప్ కంపెనీ ఉద్యోగాల కోసం వచ్చే వారిని ఇంటర్వ్యూ చేసేందుకే ప్రత్యేకమైన రోబోలను తయారు చేసింది. ఆ రోబోలకు బాట్ అని నామకరణం కూడా చేసింది. ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో కొత్తగా ఎన్నో కంపెనీలు పుట్టుకొస్తుంటాయి. ఉన్న కంపెనీలు విస్తరిస్తుంటాయి. ఫలితంగా లక్షలాది మంది అభ్యర్థులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తుంటారు. వీరి అందరి దరఖాస్తులను క్షుణ్నంగా పరిశీలించి, వివిధ దశల్లో వాటిని ఒడబోసి తమ కంపెనీకి పనికొచ్చే అభ్యర్థులను ఎంపిక చేయడం చిన్న కసరత్తు కాదు. అందుకని ఈ కసరత్తును సులభతరం చేసేందుకే బాట్ రోబోలను కంపెనీ తీసుకొచ్చింది. దరఖాస్తు ఫారాల పరిశీలన నుంచి సంబంధిత కంపెనీ లేదా బ్రాంచ్ మేనేజర్ తుది ఇంటర్వ్యూ చేసే వరకు అన్ని పనులను ఈ రోబోలే నిర్వహిస్తాయి. ఉద్యోగం వచ్చిన అభ్యర్థికి ఈ రోబోలు శుభాకాంక్షలు తెలియజేయడంతోపాటు కంపెనీ కార్యాలయాన్ని కూడా పరిచయం చేస్తాయి. ఉద్యోగం రాకపోయిన సందర్భంలో ఆ సదరు అభ్యర్థి ఏ రంగంలో రాణించగలరో, ఏ ఉద్యాగానికి పనికొస్తారో కూడా కీవర్డ్స్, జిప్ కోడ్ ద్వారా ఈ రోబోలు సూచిస్తాయి. అమెరికాలో అతిపెద్ద రిక్రూట్మెంట్లు కలిగిన ఐదు పెద్ద కంపెనీల్లో మూడు కంపెనీలు ఇప్పటికే తమ బాట్ రోబో సేవలను ఉపయోగించుకుంటున్నాయని ‘మ్యా సిస్టమ్స్’ వ్యవస్థాపకులు ఎయాల్ గ్రేఎవెస్కీ తెలిపారు. గతేడాది జూలై నెలలోనే తాము ఈ రోబోల విక్రయాన్ని ప్రారంభించామని, ఈ ఏడాది దాదాపు 20 లక్షల మంది ఉద్యోగులను ఎంపిక చేసే సామర్థ్యం కలిగిన బాట్లను ఉత్పత్తిచేసి మార్కెట్లోకి విడుదల చేస్తామని ఆయన వివరించారు. -
రోడ్ డెవలపర్స్‌కు ‘నిధుల’ వెసులుబాటు!
న్యూఢిల్లీ: రహదారుల డెవలపర్స్‌కు మరిన్ని నిధులు అందుబాటులోకి వచ్చే కీలక నిర్ణయాన్ని కేంద్రం బుధవారం తీసుకుంది. దీని ప్రకారం- బిల్డ్‌ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (బీఓటీ) ప్రాజెక్టులను పూర్తయిన రెండేళ్ల తరువాత డెవలపర్లు నూరుశాతం విక్రయించే వీలుంటుంది. తద్వారా వచ్చిన నిధులను ఇతర ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ ఆమోదంతో రూ.4,500 కోట్లు అందుబాటులోకి వస్తాయిని అంచనా. ఆర్బ్రిట్రేషన్ చట్ట సవరణకు ఆమోదం.. కాగా వాణిజ్య వివాదాల తక్షణ పరి ష్కారం లక్ష్యంగా కేబినెట్ ఆర్బ్రిట్రేషన్ చట్ట సవరణలకు ఆమోదముద్ర వేసింది.