ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సోమవారం లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ పౌరసత్వ (సవరణ) బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందితే.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పేరును నియంత హిట్లర్, డేవిడ్ బెన్ గురియన్ పక్కన కనిపిస్తోందని కొత్త వివాదానికి తెర తీశారు. సోమవారం లోక్‌సభలో ఎంపీ అసదుద్దీన్ మాట్లాడుతూ.. 'పౌరసత్వ (సవరణ) బిల్లు నుంచి దేశాన్ని రక్షించండంతో పాటు హోంమంత్రిని కూడా రక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. లేకపోతే జర్మనీలో జాతి ప్రాతిపదికపై ఏర్పాటు చేసిన నురెమ్‌బర్గ్ చట్టాలు, ఇజ్రాయెల్ పౌరసత్వ చట్టాలు చేసిన హిట్లర్, డేవిడ్ బెన్ మాదిరిగా హోంమంత్రి అమిత్‌షా పేరు వారి జాబితాలో చేరుతుంది' అని ఒవైసీ లోక్‌సభలో పేర్కొన్నారు.