
గత ఐదేళ్లలో ఆరు లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో వెల్లడించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం....విదేశాల్లో సుమారు 1.33కోట్లకుపైగా (1,33,83,718) భారతీయులు నివసిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్‌సభలో తెలిపారు.
చదవండి: ఎన్నారైలకు సీబీఎస్‌ఈ శుభవార్త! స్కూల్ అడ్మిషన్లపై కీలక ప్రకటన
2017లో 133049 మంది తమ భారత పౌరసత్వాన్ని వదులుకోగా..2018లో 134561, 2019లో 1,44,017, 2020లో 85,248 మంది, 2021 సెప్టెంబర్ నాటికి 1,11,287 మంది భారతీయులు తమ భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
సత్తా చాటుతున్న భారతీయులు..!
విదేశాల్లో భారత సంతతి వారు పలు రంగాల్లో సత్తా చాటుతున్నారు. పలు దిగ్గజ టెక్ కంపెనీల్లో భారీ సంఖ్యలో ఇండియన్స్ పనిచేస్తున్నారు. ట్విటర్‌తో పాటుగా..గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబీఎమ్ లాంటి దిగ్గజ కంపెనీలకు భారతీయులు సీఈవోలుగా పనిచేస్తున్నారు.
చదవండి: అమెరికా ఎన్నారైల్లో తెలుగు వారే టాప్.. పోటీగా గుజరాత్
Comments
Please login to add a commentAdd a comment