
200 మంది వలసదారులకు అమెరికా పౌరసత్వం
బోస్టన్: 200 మంది వలసదారులు అమెరికన్ సిటిజన్లుగా పౌరసత్వం పొందారు. బోస్టన్‌లోని జాన్ ఎఫ్.కెనడీ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ అండ్ మ్యూజియంలో మసాచుసెట్స్ ప్రాంతం కోర్టు జడ్జి డెన్నీస్ సేలర్ అధ్యక్షతన అమెరికా పౌరసత్వ కార్యక్రమం బుధవారం జరిగింది.
యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, యూఎస్ సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. కెనడీ అమెరికాకు 35వ అధ్యక్షుడిగా, ఐరిష్– కాథలిక్‌కు మొదటి కమాండర్ ఇన్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కెనడీ ముత్తాతలు ఐర్లాండ్ నుంచి వలసవచ్చారు.