JUPALLY Krishna
-
గ్రామీణాభివృద్ధికి మరిన్ని నిధుల్విండి
కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ను కోరిన మంత్రి జూపల్లి సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో గ్రామీ ణాభివృద్ధికి కేంద్రం నుంచి అందు తున్న సాయాన్ని పెంచాలని కేం ద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు కోరా రు. సోమవారం మంత్రి జూపల్లి, ఎంపీలు జితేందర్‌రెడ్డి, బీబీ పాటిల్, పంచాయతీ రాజ్ శాఖ కమిషన్ నీతూప్రసాద్.. కేంద్ర మంత్రిని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలసి వివిధ అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. తెలంగాణలో లక్ష్యానికి మించి ఉపాధి హామీ పనులు జరుగు తున్నం దున ఈ ఆర్థిక సంవత్సరానికి పని దినాలు పెంచాలని కోరారు. రూర్బన్ పథకం కింద తెలంగాణకు అదనపు క్లస్టర్లను మంజూరు చేయాలని, మహిళా సంఘాల వడ్డీ రాయితీ బకాయిలు విడుదల చేయాలని కోరారు. -
అభివృద్ధి వేగం పెంచుతాం
కొల్లాపూర్ : 2017లో అభివృద్ధి వేగాన్ని పెంచుతామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం కొల్లాపూర్‌లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని మినీ స్టేడియంలో పార్టీ నాయకులు, అధికారుల సమక్షంలో కేక్ కట్ చేసి తినిపించారు. అనంతరం వృద్ధాశ్రమంలోనూ కేక్ కట్‌చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనలో భాగంగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ చేకూరేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, వైస్‌చైర్మన్ ఎక్బాల్, ఎంపీపీ నిరంజన్ రావు, జెడ్పీటీసీ సభ్యుడు హన్మంతునాయక్, సింగిల్‌విండో చైర్మన్లు రఘుపతిరావు, ఖాజామైనొద్దీన్, టీఆర్ఎస్ మండల నాయకులు శేఖర్‌రెడ్డి, బోరెల్లి మహేష్, రహీంపాషా పాల్గొన్నారు. -
టీడీపీ కంటే రైతు వ్యతిరేకి ఎవరుంటారు?
మండిపడిన మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: తొమ్మిదేళ్ల పదవీ కా లంలో ఉమ్మడి రాష్ట్రం లో చంద్రబాబు ఎంత రైతు వ్యతిరేకిగా వ్యవహరించాడో ఇంకా తెలంగాణ ప్రజలు మరిచిపోలేదని, అసలు టీడీపీకి మించిన రైతు వ్యతిరేకి ఎవరుంటారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. రైతు పోరు యాత్రలు చేస్తున్న టీడీపీ నేతలు పచ్చని పొలాల మీద పడ్డ మిడతల దండు వంటివాళ్లన్నారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వి.గంగాధర్‌గౌడ్ లతో కలసి మాట్లాడారు. ‘మీలాంటి వాళ్లది ఎప్పటికై నా చంద్రబాబు బాటే. ఆయన వ్యవసాయం దండగన్నారు. కరెంట్ బకారుులు కట్టనన్నందుకు లక్ష మంది రైతులపై కేసులు పెట్టారు’ అని జూపల్లి అన్నారు. -
నూతన పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, జౌళి శాఖ మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వచ్చే నూతన పారిశ్రామికవేత్తలకు విమానాశ్రయం నుంచి రెడ్ కార్పెట్ వేస్తామని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, జౌళి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్), నేషనల్ అకాడమీ ఆఫ్ డెవలప్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానంపై నిర్వహించిన 2 రోజుల జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారీ పరిశ్రమల ఏర్పాటుకు 15 రోజుల్లో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు 30 రోజుల్లో అనుమతులన్నీ లభించేలా సింగిల్ విండో విధానాన్ని పక్కాగా అమలు చేస్తామన్నారు. టీఎస్ ఐ-పాస్‌లో నూతన పరిశ్రమలకు 100 శాతం స్టాంపు డ్యూటీ మినహాయింపును ఐదు నుంచి ఏడేళ్లు పన్ను మినహాయింపు ఇస్తామన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ వి.రామకృష్ణయ్య, సెస్ డెరైక్టర్ గాలబ్, డాక్టర్ కె.ఎల్.కృష్ణ, సురేందర్, కృష్ణారావు, మహేందర్‌రెడ్డి మాట్లాడారు. -
ఆదిబట్ల ఇక స్పేస్ సిటీ: మంత్రి జూపల్లి
ఆదిబట్ల: ఆదిబట్ల ఇక స్పేస్ సిటీగా రూపాంతరం చెందనుందని భారీ పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం ఆయన టాటా కంపెనీ ప్రతినిధులతో కలసి ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్లలోని ఇండస్ట్రీయల్ పార్క్‌ను సందర్శించారు. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ 43 ఎకరాల విస్తీర్ణంలో రూ.70 కోట్ల పెట్టుబడితో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ ఏర్పాటు చేసి దాదాపు 650 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని, అదే విధంగా రూ. 170 కోట్ల వ్యయంతో 10 ఎకరాల్లో ఏర్పాటు చేసిన టాటా స్కిరో స్కై ఏరోస్పేస్ లిమిటెడ్‌లో 550 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మంత్రికి తెలిపారు.