టీడీపీ కంటే రైతు వ్యతిరేకి ఎవరుంటారు? | JUPALLY Krishna Rao fires on chandrababu naidu | Sakshi
Sakshi News home page

టీడీపీ కంటే రైతు వ్యతిరేకి ఎవరుంటారు?

Published Wed, Nov 9 2016 3:58 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

టీడీపీ కంటే రైతు వ్యతిరేకి ఎవరుంటారు? - Sakshi

టీడీపీ కంటే రైతు వ్యతిరేకి ఎవరుంటారు?

మండిపడిన మంత్రి జూపల్లి  
సాక్షి, హైదరాబాద్: తొమ్మిదేళ్ల పదవీ కా లంలో ఉమ్మడి రాష్ట్రం లో చంద్రబాబు ఎంత రైతు వ్యతిరేకిగా వ్యవహరించాడో ఇంకా తెలంగాణ ప్రజలు మరిచిపోలేదని, అసలు టీడీపీకి మించిన రైతు వ్యతిరేకి ఎవరుంటారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. రైతు పోరు యాత్రలు చేస్తున్న టీడీపీ నేతలు పచ్చని పొలాల మీద పడ్డ మిడతల దండు వంటివాళ్లన్నారు.

టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వి.గంగాధర్‌గౌడ్ లతో కలసి మాట్లాడారు. ‘మీలాంటి వాళ్లది ఎప్పటికై నా చంద్రబాబు బాటే. ఆయన వ్యవసాయం దండగన్నారు. కరెంట్ బకారుులు కట్టనన్నందుకు లక్ష మంది రైతులపై కేసులు పెట్టారు’ అని జూపల్లి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement