గ్రామీణాభివృద్ధికి మరిన్ని నిధుల్విండి
కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ను కోరిన మంత్రి జూపల్లి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో గ్రామీ ణాభివృద్ధికి కేంద్రం నుంచి అందు తున్న సాయాన్ని పెంచాలని కేం ద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు కోరా రు. సోమవారం మంత్రి జూపల్లి, ఎంపీలు జితేందర్‌రెడ్డి, బీబీ పాటిల్, పంచాయతీ రాజ్ శాఖ కమిషన్ నీతూప్రసాద్.. కేంద్ర మంత్రిని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలసి వివిధ అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు.
తెలంగాణలో లక్ష్యానికి మించి ఉపాధి హామీ పనులు జరుగు తున్నం దున ఈ ఆర్థిక సంవత్సరానికి పని దినాలు పెంచాలని కోరారు. రూర్బన్ పథకం కింద తెలంగాణకు అదనపు క్లస్టర్లను మంజూరు చేయాలని, మహిళా సంఘాల వడ్డీ రాయితీ బకాయిలు విడుదల చేయాలని కోరారు.