request documents
-
మోకాళ్లపై కూర్చుని మంత్రికి వినతి
గోవిందరావుపేట (ములుగు): భూపాలపల్లి జిల్లాలో ఐదో పోలీసు బెటాలియన్ ఏర్పాటుచేసేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా గోవిందరావుపేట మండలం చల్వాయి శివారులోని భూమిని తాజాగా డీజీపీ అనురాగ్‌శర్మ పరిశీలించారు. అయితే, అది ప్రభుత్వ భూమే అయినా దశాబ్దాలుగా నిరుపేద రైతులు ఖాస్తులో ఉన్నారు. ప్రస్తుతం ఆ భూమిని బెటాలియన్‌కు కేటాయిస్తే తాము అన్యాయానికి గురవుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈక్రమంలో మండలంలోని నేతాజీనగర్‌కు మంత్రి చందూలాల్ రాగా ఆయనకు వినూత్న రీతిలో తమ సమస్యను రైతులు తెలియజేశారు. మంత్రి కాన్వాయ్ వెళ్తుండగా రైతులు మోకాళ్లపై కూర్చుని వినతిప త్రాలు చూపించారు. దీంతో మంత్రి కాన్వాయ్ ఆపి రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యను తెలుసుకున్నారు. తాను అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని ఆయన రైతులకు హామీ ఇచ్చారు. -
కలెక్టరమ్మా.. కనికరించవమ్మా..
► ప్రజావాణిలో విన్నపాలు ► 121 దరఖాస్తుల స్వీకరణ పెద్దపల్లిరూరల్ : తమ సమస్యలపై వినతిపత్రాలు అందించి వాటిని పరిష్కరించాలంటూ బాధితులు వేడుకున్నారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ వర్షిణి, డీఆర్వో వెంకటేశ్వర్లు వినతులు స్వీకరించారు. ఇల్లు లేని తమకు డబుల్ బెడ్రూం గృహాల కేటాయింపులో ప్రాధాన్యతనివ్వాలని, పింఛన్లు అందించాలని వృద్ధులు, రేషన్ కార్డులు కావాలని తమ సమస్యలను ఏకరువుపెట్టారు. సోమవారం నాటి ప్రజావాణిలో 121 దరఖాస్తులు వచ్చాయి. ట్యాంకు కట్టకుండానే డబ్బు మింగిండ్రు.. మా ఊరిలో రూ. 6లక్షలతో మంచినీటి ట్యాంకు కట్టాల్సిఉంది. లక్ష రూపాయలు కూడా ఖర్చు చేయకుండానే ట్యాంకుకు మెరుగులు దిద్ది రూ.5.89లక్షల బిల్లులు పొందారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కాంట్రాక్టర్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. – పుట్ట రామయ్య, ఖానాపూర్,మంథని ఉపాధి మార్గం చూపించండి.. సుగ్లాంపల్లిలోని శాలివాహన పవర్‌ప్లాంటులో 8 ఏళ్లుగా పని చేస్తున్నాం. గతేడాది జూలై నుంచి ప్లాంటు మూసివేశారు. అప్పటినుంచి అక్టోబర్వరకు సగం జీతం ఇచ్చిన యాజమాన్యం, ఆ తర్వాత నుంచి పట్టించుకోవడంలేదు. కంపెనీలో పని చేస్తేనే మా కుటుంబం గడిచేది. ఇప్పుడు పనిలేక పాలుపోవడంలేదు. ప్లాంట్‌ను తెరిపించి పని కల్పించాలి. లేదంటే ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూపించాలి. – సుగ్లాంపల్లి పవర్‌ప్లాంట్ వర్కర్స్ పింఛన్ ఇప్పించండి దేవుడిని నమ్ముకుని బతుకుతున్నాం. మాకు ఏ ఆధారం లేదు. సర్కారు పట్టించుకోవడంలేదు. మొన్నటిదాకా మాలాంటోళ్లకు పింఛన్ డబ్బులు వస్తాయన్నారు. ఇప్పటిదాకా ఇచ్చినోళ్లులేరు. ఆసరాగా నిలిచేందుకు ప్రభుత్వం పింఛన్ పించి ఆదుకోవాలి. – రామగుండం జోగినులు ఖాళీ చేయమని బెదిరిస్తున్నారు చాలాఏళ్లుగా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలోని సర్వే నంబరు 45లో నివసిస్తున్నాం. ప్రభుత్వం మాకు రేషన్ కార్డులు, ఆధార్‌కార్డులు ఇచ్చిం ది. అయితే ఇప్పుడు గ్రామానికి చెందిన మద్దెల శ్రీహరి భూమి తనదంటూ ఖాళీ చేయించాలని కొందరు అధికారులతో కలిసి బెదిరిస్తున్నారు. ఇళ్ల సమీపంలో మద్యం దుకాణం పెట్టి ఇబ్బంది పెడుతున్నాడు. –గర్రెపల్లి ఒడ్డెర కుటుంబాలు కనీస వసతులు కల్పించాలి సింగరేణి ప్రాజెక్టు కోసం మా భూములు తీసుకున్నారు. పునరావాసకాలనీలో కనీస సౌకర్యాలు లేవు. తాగునీరు, డ్రెయినేజీలు నిర్మించలేదు. విద్యుత్‌సౌకర్యం లేక అంధకారం నెలకొని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఎన్నోసార్లు సింగరేణి, రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నాం. – గోపాల్, రాజమల్లు, లద్నాపూర్ -
గ్రామీణాభివృద్ధికి మరిన్ని నిధుల్విండి
కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ను కోరిన మంత్రి జూపల్లి సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో గ్రామీ ణాభివృద్ధికి కేంద్రం నుంచి అందు తున్న సాయాన్ని పెంచాలని కేం ద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు కోరా రు. సోమవారం మంత్రి జూపల్లి, ఎంపీలు జితేందర్‌రెడ్డి, బీబీ పాటిల్, పంచాయతీ రాజ్ శాఖ కమిషన్ నీతూప్రసాద్.. కేంద్ర మంత్రిని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలసి వివిధ అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. తెలంగాణలో లక్ష్యానికి మించి ఉపాధి హామీ పనులు జరుగు తున్నం దున ఈ ఆర్థిక సంవత్సరానికి పని దినాలు పెంచాలని కోరారు. రూర్బన్ పథకం కింద తెలంగాణకు అదనపు క్లస్టర్లను మంజూరు చేయాలని, మహిళా సంఘాల వడ్డీ రాయితీ బకాయిలు విడుదల చేయాలని కోరారు. -
ఒక్కో జెడ్పీకి రూ. 100 కోట్లివ్వండి
♦ మంత్రులు కేటీఆర్, ఈటలకు ♦ జెడ్పీ చైర్మన్ల వినతిపత్రాలు సాక్షి, హైదరాబాద్: జిల్లా పరిషత్‌ల వద్ద ప్రస్తుతం ఎటువంటి నిధులు లేనందున, ఒక్కో జిల్లా పరిషత్‌కు రూ. 100 కోట్లు ఇవ్వాలని పలువురు జెడ్పీ చైర్మన్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయినందున అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పంచాయతీరాజ్ మంత్రి కె.తారక రామారావును, ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ను శనివారం సచివాలయంలో కలసి వినతిపత్రాలు అందజేశారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా గ్రామ పంచాయతీలకు అందుతున్న 100 శాతం నిధుల్లో జెడ్పీలకు వాటా తిరిగి ఇచ్చేవిధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని మంత్రులను కోరారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తలసరి గ్రాంటును రాష్ట్ర ప్రభుత్వం తగిన నిష్పత్తిలో పెంచలేదని గుర్తు చేశారు. రాజ్యాం గ సవరణ ప్రకారం పంచాయతీ వ్యవస్థకు బదలాయించాల్సిన 29 అంశాలను వెంటనే జెడ్పీల పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. మంత్రులను కలసిన జెడ్పీ చైర్మన్లలో తుల ఉమ (కరీంనగర్), సునీత (రంగారెడ్డి), బాలు నాయక్ (నల్లగొండ), డి.రాజు (నిజామాబాద్), రాజమణి (మెదక్), కవిత (ఖమ్మం), భాస్కర్ (మహబూబ్‌నగర్), పద్మ (వరంగల్), శోభారాణి (ఆదిలాబాద్) ఉన్నారు.