ఆ ఫోటోగ్రాఫ్తో మాకు సంబంధం లేదు
ఇది కొందరి అసత్య ప్రచారం: మలబార్ గోల్డ్
హైదరాబాద్: పాకిస్తాన్ జాతీయ పతాకాన్ని పోలి ఉన్న కేక్‌ను కోస్తున్నట్లు ఉన్న ఫోటోగ్రాఫ్‌తో తమకెలాంటి సంబంధం లేదని ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా నమ్మకమైన కస్టమర్ బేస్ కలిగిన తమ బ్రాండ్‌ను అపఖ్యాతి పాలుచేయడానికి కొందరు ఈ కుట్రపన్నారని, సోషల్‌మీడియాలో ఈ మేరకు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. అసలు ఆ కేక్ కటింగ్ చేసింది యూఏఈ ఎక్స్చేంజ్ కంపెనీ అని తెలియజేసింది.