వైరల్‌: యువతి తలను కోసుకుని తినొచ్చు!! | Young Woman Head Shaped Cake Gone Viral On Social Media | Sakshi
Sakshi News home page

వైరల్‌: యువతి తలను కోసుకుని తినొచ్చు!!

Published Mon, Nov 23 2020 12:40 PM | Last Updated on Mon, Nov 23 2020 1:12 PM

Young Woman Head Shaped Cake Gone Viral On Social Media - Sakshi

వీడియో దృశ్యం

మనల్ని ఆశ్చర్యపరిచే సరికొత్త వీడియోలు నిత్యం సోషల్‌ మీడియాలో వైరలవటం పరిపాటిగా మారింది. వాటిలో కొన్ని ఎంటర్‌టైన్‌ చేసేవి అయితే మరికొన్ని మనల్ని ఎడ్యుకేట్‌ చేసేవి. తాజాగా ఓ కేకుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. అచ్చం తన తల ఆకారంలో కేకును తయారు చేసిందో యువతి. యువతి తలను, కేకు పక్కన పెడితే తేడా తెలియనంతగా చక్కగా రూపొందించింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ‘ సైడ్‌ సర్ఫ్‌ కేక్స్‌’లో ఇందుకు సంబంధించిన వీడియోను షేర్‌ చేసింది. ‘నేను తయారు చేసిన కేకుల్లో ప్రత్యేకమైనది’ అనే శీర్షికను జోడించింది. (2 వేల ఏళ్ల నాటి శవాలు: లావాలో..)

ప్రస్తుతం ఈ వీడియో 7 లక్షలకు పైగా వ్యూస్‌, 90 వేలకు పైగా లైక్స్‌, వందల సంఖ్యలో కామెంట్లతో దూసుకుపోతోంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ నేను మొదటిసారి చూసినపుడు మేకప్‌ ఏమో అనుకున్నాను... నేను ఆ వీడియో చూస్తున్న కొద్దీ ఆశ్చర్యపోతూనే ఉన్నా... ఆగండి! ఇదేమి మంత్రం... ఈ యువతి తలను కోసుకుని తినొచ్చు!!’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement