
జస్ట్ టేస్ట్ ఇట్
డోనట్... రిచ్ ఫ్యాట్ కంటెంట్‌తో తయారైన కేక్. మామిడిని మరిపించే మ్యాంగో డోనట్... పిల్లలకోసం ఓరియో డ్రీమ్, రంగు రంగుల హరివిల్లులా ఆకట్టుకునే రెయిన్‌బో...
డోనట్... రిచ్ ఫ్యాట్ కంటెంట్‌తో తయారైన కేక్. మామిడిని మరిపించే మ్యాంగో డోనట్... పిల్లలకోసం ఓరియో డ్రీమ్, రంగు రంగుల హరివిల్లులా ఆకట్టుకునే రెయిన్‌బో... ఇలా రకరకాల ఫ్లేవర్స్‌తో నగరవాసులకు తన రుచులను పంచేందుకు సిద్ధమైంది. ఎప్పటికప్పుడు తయూరు చేసి అందించడం ఇక్కడి స్పెషాలిటీ.
ప్యాషనేట్ పార్ట్‌నర్స్
భువనేష్ సుబ్రహ్మణ్యం 2011లో ఈ డోనట్ హౌస్‌ను చెన్నైలో ఏర్పాటు చేశాడు. అక్కడ టేస్ట్ చూసిన నగరవాసులు జయ్‌ప్రకాశ్, శ్రీకాంత్, మోహన్, శర్వాణీలు దానిపై వునసు పడ్డారు. ఈ రుచిని హైదరాబాదీలకు పంచేందుకు సోమాజీగూడలో ఈ డోనట్ హౌస్ ఏర్పాటు చేశారు.
హ్యాంగౌట్ ప్లేస్
హైదరాబాద్‌లో ఇది మొట్టమొదటి బ్రాంచ్. దీంట్లో లైవ్ కిచెన్ కూడా ఉంది. గంటకోసారి తయారు చేసే వీటిని ఎలా చేస్తున్నారో చూసే వీలు కూడా ఉంది. డోనట్ హౌస్ కోసమే శిక్షణ పొందిన ప్రత్యేక చెఫ్ మీ ముందే వండి వడ్డిస్తారు. మొత్తం 35 వెరైటీల్లో మీకు ఏది కావాలంటే అది తినేయెచ్చు. కోడిగుడ్డు కలపని ఈ వెరైటీలను ఓసారి రుచి చూస్తే ఆహా అనాల్సిందే.
స్పెషల్ డిషెస్
సమ్మర్ సీజన్‌లో మ్యాంగో డోనట్స్ ఫేమస్ అయితే... కిడ్స్ నోరూరించే ఓరియో డ్రీమ్స్ పూర్తిగా డార్క్ చాక్లెట్‌తో ఫిల్ చేసినవి. హరివిల్లునుతలపించే రెయిన్‌బో డోనట్‌ను ఓరియోతోనే గార్నిష్ చేస్తారు. చాక్లెట్ అంటే పడిచచ్చేవారికైతే ఏలియన్, చీనీ స్ట్రాబె ర్రీ డోనట్స్ సరిగ్గా సరిపోతారుు. స్పైసీని కోరుకునే వారికోసం ఇటాలియన్ స్పైసెస్, చిల్లీ చీజ్ కూడా దొరుకుతారుు. ఇక మొజిటోస్‌తో ఇండియాలోనే మొదటి డోనట్‌బర్గర్ ఇక్కడి ప్రత్యేక డిష్. సో... లేటెందుకు? జస్ట్ టేస్ట్ ఇట్!
- సిద్ధాంతి