కేక్ అనేది మన సంప్రదాయ వంటకం కాదు. బ్రిటీష్ వాట్ల నుంచి వచ్చిందే. అయితే మన దేశంలో మొట్టమొదటి క్రిస్మస్ కేక్ ఎక్కడ తయారయ్యింది? ఎవరు తయారు చేశారో వింటే ఆశ్చర్యపోతారు. పైగా ఆ కాలంలో కేక్ తయారీకి కావల్సిన పదార్థాలు కూడా అందుబాటులో కూడా ఉండేవి కాదు. అయితే కేరళకు చెందిన ఒక వ్యక్తి బ్రిటీష్ వాళ్లు మెచ్చుకునేలా తయారుచేశాడు. ఇప్పుడు అతని షాపే ఫ్లమ్ కేక్ తయారీలో నెంబర్ వన్‌గా లాభాలు ఆర్జిస్తోంది కూడా.
1883లో క్రిస్మస్ సందర్భంగా బర్మా నుంచి వచ్చిన ఔత్సాహిక స్థానిక వ్యాపారవేత్త మాంబల్లి బాపు భారతదేశంలో తొలి క్రిస్మస్ కేక్‌ని తయారు చేశారు. దాల్చిన చెక్క తోటను అభివృద్ధి చేస్తున్న బ్రిటీష్ వ్యవసాయాధికారి మర్డోక్ బ్రౌన్ సూచనలతో తయారు చేసినట్లు బాపు మనవడు చెబుతున్నాడు. తన ముత్తాత మాంపల్లి బాపు బర్మాలో వ్యాపారావేత్త. అతను ఈజిప్టులో బ్రిటీష్ దళాలకు పాలు, టీ, రొట్టే వంటివి రవాణ చేసేవాడని, ఆ తర్వాత 1880లో కేరళలలోని తన సొంతూరు తలస్సేరికి వచ్చిన వెంటనే బేకరీని స్థాపించాడని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
అయితే దూరంగా ఉన్న కోలకతాలో ఉన్న ఒకేఒక్క బేకరీ మాత్రమే బ్రిటీష్ ప్రజల అవసరాలను తీర్చేది. ఆ లోటుని బాపు బిస్కట్స్ ఫ్యాక్టరీ తీర్చింది. కాబట్టి బాపు రాయల్ బిస్కట్స్ ఫ్యాక్టరీ భారతీయులచే స్థాపించబడిన తొలి బేకరిగా మారింది. బర్మాలో ఉండగా బాపు తొలుత బిస్కెట్ తయారీలో మంచి శిక్షణ పొందాడు. ఆ బ్రిటీష్ రైతు మర్డోక్ బ్రౌన్ ఇంగ్లండ్ నుంచి తెచ్చిన రిచ్ ప్లం కేక్‌తో బాపు బిస్కెట్ ఫ్యాక్టరీకి వెళ్లాడు. కేక్ ముక్కను రుచి చూడమని బాపుని కోరాడు. అంతేగాక ఇదే మాదిరిగా కేక్‌ని తయారీ చేయాలని చెప్పాడు కడా. ఈ తయారీనే తనకు భారతదేశ పాకశాస్త్ర చరిత్రలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరస్తుందని ఊహించని బాపు అందుకు ఒప్పుకున్నాడు. మర్డోకో ఆ కేక్ తయారీకి కావాల్సిన బ్రౌన్ కోకో, ఖర్జూరం, ఎండుద్రాక్ష, వివిధ డ్రై ఫ్రూట్స్‌ని అందించాడు.
అలాగే పక్కనే ఉన్న పుదుచ్చేరి నుంచి బ్రాందీని కూడా కొనుగోలు చేసి తయారు చేయమని చెప్పాడు మర్డోక్. ఆ రోజుల్లో కిణ్వన ప్రక్రియ కోసం అందుబాటులో ఈస్ట్ లేదు. అందుకని 14 కిలోమీటర్లు ప్రయాణించి మాహేకి వెళ్లి బ్రాందీని కొనుక్కోవాల్సి వచ్చేది. దీంతో వ్యయభారాన్ని తగ్గించుకునేందుకు బాపు జీడిపప్పు, యాపిల్, అరటి రకమైన కడలిపాజమ్‌ని ఉపయోగించి స్థానికంగా తయారుచేసిన మద్యంతో ఆ సమస్యను భర్తీ చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అలా కేక్ తయారీకి స్థానికంగా తయారైన మద్యంతోనే తయారు చేయడం మొదలు పెట్టాడు బాపు.
అయితే బాపు చేసిన కేక్‌ని రుచి చూసిన మర్డోకో బ్రౌన్ వావ్! ఇదే ది బెస్ట్ కేక్ అని కితాబి ఇచ్చి మరీ డజనులు కొద్దీ కేకులను కొనుక్కుని మరీ వెళ్లాడు. ఇప్పుడూ ఆ షాపే భారతదేశంలో అతిపెద్ద ప్లం కేక్ మార్కెట్‌ని కలిగి ఉంది. ఈ వ్యాపారంలో మాంపల్లి కుటుంబానికి ప్రధాన వాటా కూడా ఉందని బాపు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అతడి కుటుంబ సభ్యులంతా కేరళలో అగ్రశ్రేణి బేకరీలను నిర్వహిస్తున్నారు. వారంతా కేరళలో.. కొచ్చిలోని కొచ్చిన్ బేకరీ, తిరువనంతపురంలోని శాంత బేకరీ, కోజికోడ్‌లోని మోడరన్ బేకరీ, కొట్టాయంలోని బెస్ట్ బేకింగ్ కో. తలస్సేరిలోని మాంబల్లి బేకరీలతో బాపు వారసత్వాన్ని కొనసాగించడం విశేషం. అంతేగాదు ప్రతీ బేకరీలో బాపు బ్రౌన్‌కేక్‌ను అందచేసిన పేయింటింగులతో కస్టమర్లను స్వాగతిస్తూ చారిత్రక ఘట్టాన్ని తెలియజేస్తున్నారు.
(చదవండి: జీసస్ రియల్ లుక్ ఎలా ఉండేదంటే..? పరిశోధనలో షాకింగ్ విషయాలు)
Comments
Please login to add a commentAdd a comment