
పూజా హెగ్డే
సినిమా షూటింగ్స్‌తో వాళ్ల పుట్టినరోజులు జరుపుకోవడానికే కొన్నిసార్లు కుదరదు స్టార్స్‌కి. అయితే లాక్ డౌన్ వల్ల ఇంట్లోనే ఉండిపోవాల్సి రావడంతో ఫ్యామిలీతో కావాల్సినంత క్వాలిటీ టైమ్ గడుపుతున్నారు. శనివారం పూజా హెగ్డే తండ్రి పుట్టినరోజు. నాన్నకు ప్రేమతో ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు. ఇటీవలే వంట చేయడం, కేక్ చేయడం నేర్చుకున్నారు పూజ. దాంతో తన తండ్రి కోసం ఎంతో ప్రేమగా కేక్ తయారు చేశారు. ‘‘మా నాన్న కోసం చేశాను. ఆయన్ను సర్‌ప్రైజ్ చేయబోతున్నాను’’ అని తయారు చేసిన కేక్ ఫోటోలను షేర్ చేశారామె.