రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) జాతీయ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఈ రోజు(జూన్ 11) తన77వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో కలిసి లాలూ యాదవ్ కుటుంబసభ్యులు 77 కిలోల కేక్‌ను కట్ చేశారు. ఆర్జేడీ కార్యకర్తలు 77 కిలోల లడ్డూలను రబ్రీ నివాసానికి తీసుకువచ్చారు. ఈ వేడుకల్లో రబ్రీదేవి, కుమార్తె రోహణి ఆచార్య పాల్గొన్నారు.
దీనికి ముందు లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన తల్లి, సోదరితో కలిసి తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ సమక్షంలో కేక్ కట్ చేసి, సంబరాలు చేసుకున్నారు. తన 'ఎక్స్' ఖాతాలో ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘సాన్నిహిత్యం, వినయం, సరళత కలగలసిన వ్యక్తి’ అంటూ తన తండ్రిని కొనియాడారు. ఈ ఫొటోలలో లాలూ యాదవ్, రోహిణి ఆచార్య కూడా కనిపిస్తున్నారు.
లాలూ ప్రసాద్‌కు బీహార్ నేత చిరాగ్ పాశ్వాన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, దీర్ఘకాలం జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. లాలూ ప్రసాద్ కుమార్తెలు మిసా భారతి, రోహిణి ఆచార్య లు పట్నాలో పార్టీ నేతలకు, కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. ఆర్జేడీ కార్యాలయంలో కూడా లాలూ ప్రసాద్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి.
To the person who is a perfect blend of affinity, humility and simplicity.
THE MAN who leads by example.
A leader who nurtures leaders.
Happiest birthday my papa ♥️
Love you infinity ♾️ @laluprasadrjd @yadavtejashwi @RJDforIndia @RahulGandhi @yadavakhilesh @RabriDeviRJD pic.twitter.com/XmpsZV30Ju— Tej Pratap Yadav (@TejYadav14) June 10, 2024
Comments
Please login to add a commentAdd a comment