
బర్త్ డే సెలబ్రేషన్స్‌లో ఏం జరిగింది?!
సాక్షి, స్పెయిన్: పుట్టిన రోజు అంటేనే స్పెషల్ డే.. అందులోనూ చిన్న పిల్లల బర్త్‌డే అంటే ఇంట్లో ఇందరికీ పండుగ రోజనే చెప్పాలి. ఇంటిని అందంగా డెకరేట్ చేయడంతో పాటు.. బంధువులను, స్నేహితులను పిలిచి సాయంత్రం కేక్ కటింగ్ చేసి పార్టీ చేసుకుంటాం.
అందరిలాగే స్పెయిన్‌లో ఒక ఫ్యామిలీ తమ 11 బిడ్డ బర్త్‌డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలనుకున్నారు.. స్నేహితులను, చుట్టాలను అందరినీ సాయంత్రం కేక్ కటింగ్‌కు పలిచారు. అందరూ హ్యాపీ బర్త్‌డే సాంగ్ పాడుతుండగా.. ఆ చిన్నారి కేక్‌కటింగ్‌కు సిద్దమైంది. కేక్‌పైన రెండు (కొవ్వొత్తుల మాదిరిగా) మెరుపులు వెదజిల్లే టపాసులు ఉంచారు. వాటిని చిన్నారి నోటితో ఊది ఆర్పే ప్రయత్నం చేస్తుండగా.. వెనకనుంచి అన్న ఆనందంతో ఫోమ్‌ను వెదజల్లాడు.. ఈ క్రాకర్స్‌కు ఆ ఫోమ్ తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగి.. చిన్నారి మొహం కాలిపోయింది. ఎడమ కంట్లో నిప్పురవ్వలు పడడంతో కన్ను పూర్తిగా పోయింది. ప్రస్తుతం ఆ చిన్నారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.