మహానంది: కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తజనంతో మహానంది క్షేత్రం కిటకిటలాడింది. పవిత్ర కార్తీకమాసంలో దీపం, దానం, స్నానం ఎంతో ప్రధానమైనవి. ఈ మాసంలో వేకువజామునే పుణ్యస్నానాలు ఆచరించి ముక్కంటీని దర్శించుకోవడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
వేకువజాము నుంచి దర్శనాలు ప్రారంభం కావడంతో శ్రీకామేశ్వరీదేవీ సహీత మహానందీశ్వరస్వామివార్ల దర్శనార్థం భక్తులు బారులు తీరారు. స్థానిక కోనేరులలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించారు. శ్రీకామేశ్వరీదేవీ సహీత మహానందీశ్వర, వినాయకనంది, గరుడనంది, సూర్యనంది ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహానంది క్షేత్రానికి వచ్చిన భక్తులు వర్షంతో తీవ్ర అవస్థలు పడ్డారు. అధికారులు ఎలాంటి ప్రత్యేక చర్యలు చేపట్టకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.