mahanandi temple
-
ఇహలోక అద్భుతం మహానంది
దేశంలోని ప్రముఖ శైవక్షేత్రాలలో ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా నల్లమలలో వెలసిన మహానంది ఒకటి. ఆరవ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో అన్నీ ప్రత్యేకతలే! ఇక్కడ మహానందీశ్వరుడితో పాటు కోదండరాముల వారూ కొలువై ఉండటంతో ఇది శివకేశవుల నిలయంగానూ మారింది. ఇక్కడ మహానందీశ్వరుడు పుట్టలోంచి స్వయంభువుగా వెలిశాడు. శివలింగం పుట్ట ఆకారంలో కనిపిస్తుంది. అంతేకాకుండా స్వయంభువైన శ్రీ మహానందీశ్వరుడిని స్పృశిస్తూ వచ్చే జలం.. శైలధార, దివోదుని ధార, నరసింహధార, నంది తీర్థం, కైలాస తీర్థమనే ఐదు ధారలుగా ఇక్కడున్న రుద్రగుండం, బ్రహ్మగుండం, విష్ణుగుండం కోనేరుల్లోకి పడుతూ ఎల్లప్పుడూ ఒకే నీటి మట్టాన్ని ఉంచుతోంది.చిన్న గుండు సూది వేసినా పైకి కనపడేంత స్వచ్ఛంగా ఉంటుందా జలం. మహానందీశ్వరస్వామి ఆలయానికి వస్తే.. గర్భగుడి చాళుక్యుల కాలంనాటి కళింగ ఆర్కిటెక్చర్ తరహాలో శిల్పాకళా వైభవాన్ని కలిగి ఉంటుంది. దీన్ని మహానందీశ్వరస్వామే స్వయంగా రససిద్ధుడనే శిల్పితో నిర్మించుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. గర్భగుడి గోపురం చుట్టూ ఉండే నంది విగ్రహాల్లో ఓ నందికి రెండు తలలు ఉండటం మరో ప్రత్యేకత. వేసవిలో చల్లగా.. శీతకాలంలో వెచ్చగా.. మహానంది కోనేటి నీటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. ఈ నీటిలో తొమ్మిది రకాల ఖనిజాలు ఉన్నాయని సమాచారం. బోరుబావుల్లో లభించే నీటిలో పలు రకాల రసాయనాలు వేసి అధునాతన యంత్రపరికరాల ద్వారా వడపోస్తే కానీ సాధారణ పీహెచ్ స్థాయి రాదు. అలాంటిది మహానందీశ్వరుడి చెంత ప్రవహించే నీటిలో సహజంగానే పీహెచ్ స్థాయి 7.1 ఉండటం విశేషం. అంతేకాదు ఇక్కడి కోనేరుల్లోని నీరు వేసవిలో చల్లగా ఉంటుంది. శీతకాలంలో వెచ్చగా మారుతుంది. తెల్లవారుజామున చూస్తే కోనేరులు పొగలు గక్కుతున్నట్లు కనిపిస్తాయి. స్ఫటికమంత స్వచ్ఛంగా ఉన్న ఈ నీటిలో ఆలయ గోపురాలు ప్రతిబింబిస్తూ భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి. వేలాది ఎకరాలకు సాగునీరుగా.. మహానందీశ్వరస్వామి దేవస్థానానికి చెందిన వందలాది ఎకరాలతో పాటు చుట్టుపక్కల ఉండే పొలాలకూ ఈ కోనేటి నీటినే వినియోగిస్తున్నారు. కోనేరుల్లోంచి నీరు రెండు పాయల ద్వారా బయటికి ప్రవహిస్తూ పొలాల మీదుగా వెళ్లి తెలుగుగంగ కాలువలో కలుస్తోంది. మహానంది ఆలయ పరిధిలోని 53.41 ఎకరాల్లో ఎక్కడైనా సరే రెండు అడుగుల లోతు గుంత తీస్తే చాలు నీరు ఉబికి వస్తుంది.ఓ అద్భుత దివ్యక్షేత్రంఏ ఆలయంలో అయినా ఒక విశేషం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం దేనికి అదే ఓ విశేషం. ఇక్కడి రుద్రగుండం కోనేరును నంది తీర్థంగా పురాణాల్లో వర్ణించారు. ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ సప్తమి రోజున గంగాదేవి స్వయంగా ఇక్కడ స్నానమాచరిస్తూ భక్తుల పాపాలను పోగొడుతుందని శివపురాణంలో వర్ణించారు. ఇక్కడ స్నానమాచరిస్తే శరీర రుగ్మతలు తొలగిపోతాయని ఎంతోమంది అనుభవపూర్వకంగా చెప్పడమే కాదు శాస్త్రీయంగానూ నిరూపితమైంది. – బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, మహానంది దేవస్థానం వేద పండితులు -
మహానందిలో చిరుతపులి కలకలం
-
మహానంది క్షేత్రంలో మళ్లీ చిరుత కలకలం..
-
మహానంది ఆలయంలో చిరుత
-
బలగం సినిమాతోనే గుర్తింపు: సంజయ్‌కృష్ణ
బలగం చిత్రంతోనే తనకు మంచి గుర్తింపు లభించిందని సినీ నటుడు సంజయ్‌కృష్ణ అన్నారు. మహానందీశ్వరుడి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఆయన మహానందికి వచ్చారు. శ్రీ కామేశ్వరీదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ 2013లో మొదటగా కాళీచరణ్ చిత్రంలో నటించానన్నారు. బాలకృష్ణ హీరోగా చేసిన అఖండ, జయసింహా, భగవంత్ కేసరి, చిరంజీవి నటించిన ఆచార్య, పవన్ కల్యాణ్ నటించిన బీమ్లానాయక్, కాటమరాయుడు చిత్రాలు మంచి పేరు తెచ్చాయన్నారు. ఇప్పటి వరకు 53 చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించానన్నారు. ప్రస్తుతం నితిన్ హీరోగా ఓ చిత్రంతో పాటు ఎనిమిది నూతన చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభతో పాటు మంచి పాత్రలు దొరికితేనే గుర్తింపు లభిస్తుందన్నారు. ఆయనను గుర్తించిన అభిమానులు ఫొటోలు తీసుకుంటూ అభిమానం చాటుకున్నారు. -
Mahanandi Temple: మహానంది ఆలయానికి మహర్దశ
మహానంది: భక్తుల కోర్కెలు తీర్చే మహానందీశ్వరుడి ఆలయానికి మహర్దశ వచ్చింది. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి చొరవ, ఈఓ కాపు చంద్రశేఖర్‌రెడ్డి పర్యవేక్షణతో మహానంది క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని శైవక్షేత్రాల్లో ఒకటైన మహానంది క్షేత్రానికి గతంలో ఏడాదికి రూ.7 నుంచి రూ.10 కోట్ల ఆదాయం వచ్చేది. రెండేళ్ల నుంచి రూ.13 కోట్ల నుంచి రూ.16 కోట్ల వరకు వస్తోంది. ఇక ఈ ఏడాది భారీగా పెరిగింది. కోనేరుల మరమ్మతులకు శ్రీకారం ఆలయ పరిధిలో పెద్దకోనేరు(రుద్రగుండం)తో పాటు రెండు చిన్న కోనేరులు ఉన్నాయి. వాటి మరమ్మతులకు దేవదాయశాఖ రూ.80 లక్షలు మంజూరు చేసింది. అందులో భాగంగా సీజీఎఫ్ నుంచి రూ.40 లక్షలు, దేవస్థానం నుంచి రూ.40 లక్షలు కేటాయిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పనులకు త్వరలో భూమిపూజ చేయనున్నారు. అలాగే ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి స్వంత నిధులు రూ.2 కోట్లతో రాతి నంది విగ్రహాన్ని అభివృద్ధి చేశారు. చుట్టూ వాటర్ ఫౌంటెయిన్, గ్రీనింగ్, అధునాతనమైన లైటింగ్ అమర్చారు. వాటితో పాటు ఆలయ మాడవీధుల్లో ల్యాండ్ స్కేపింగ్ పనులు చేపడుతున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు ఒకరోజు ఇక్కడే ఉండి పోవాలన్నంత అందంగా తీర్చిదిద్దుతున్నారు. రూ.4.60 కోట్లతో గదుల నిర్మాణం టీటీడీ ఆధ్వర్యంలో రూ.4.60 కోట్లతో 27 గదుల నిర్మాణానికి త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా నంది విగ్రహం ఎదురుగా ఉన్న వేదపాఠశాల భవనం ప్రాంగణంలో సాయిల్టెస్టును సేకరించారు. త్వరలోనే పనులు మొదలు పెట్టనున్నారు. వీటితో పాటు దాతలు, భక్తుల సహకారంతో వంద వసతి గృహాల నిర్మాణం చేపట్టనున్నారు. ఏపీ టూరిజం, ప్రస్తుతం ఉన్న టీటీడీ వసతి గృహాల మధ్యలో ఖాళీగా ఉన్న స్థలంలో 50 గదులు, పార్వతీపురం రస్తాలో ఉన్న దేవస్థానం స్థలంలో మరో 50 వసతి గృహాలను నిర్మాణానికి దేవదాయశాఖ ఆమోదం తెలిపింది. మహానందీశ్వర, కామేశ్వరీదేవి, గంగాసదన్ల పేర్లు ప్రతిపాదించి త్వరలో నిర్మాణం మొదలు పెట్టనున్నారు. అన్నదానానికి రూ.2.30కోట్లు డిపాజిట్లు మహానంది దేవస్థానంలో నిర్వహించే అన్నదాన పథకానికి రూ.2.30 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. గతంలో రోజుకు 150 మందికి అన్నప్రసాద వితరణ చేసేవారు. ప్రస్తుతం 200 మందికి పంపిణీ చేస్తుండగా ఆ సంఖ్యను మూడొందలకు పెంచాలని ప్రతిపాదించారు. శని, ఆది, సోమవారాల్లో ఐదు వందల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అరిటాకుల్లో అన్నప్రసాదాలు పంపిణీ చేస్తూ భక్తుల మన్ననలు పొందుతున్నారు. భక్తుల సౌకర్యార్థం దాతల సహకారంతో రూ. 15 లక్షలు వెచ్చించి స్టెయిన్లెస్ స్టీల్ టేబుళ్లు, కుర్చీలు కొనుగోలు చేశారు. మరింత మంది భక్తులకు అన్నప్రసాదాలు అందాలన్న సదుద్దేశంతో రైతుల నుంచి 1,000 బస్తాల వరిధాన్యం సేకరించారు. కార్తీకమాసంలో రూ.1.40 కోట్లు ఆదాయం మహానందికి అన్ని విభాగాల నుంచి ఆదాయాన్ని పెంచి భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతంలో హుండీ కానుకల లెక్కింపు జరిగితే రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షలు ఆదాయం వచ్చేది. గత ఏడాది నవంబర్‌లో 49 రోజులకు నిర్వహించిన హుండీ కానుకల లెక్కింపు ద్వారా రూ.63,71,256 ఆదాయం సమకూరింది. అలాగే గత ఏడాది కార్తీకమాసంలో నెలరోజులకు రూ.96 లక్షల ఆదాయం రాగా ఈసారి రూ.1.40 కోట్ల ఆదాయం వచ్చింది. గతంలో కంటే అదనంగా రూ. 44 లక్షలు ఆదాయం పెరిగింది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. అవినీతి రహిత పాలనే ధ్యేయంగా పనిచేస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. మహానందీశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఎక్కడా రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు. ఆలయానికి ఆదాయం పెంచడంతో పాటు భక్తుల సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నాం. దాతల సహకారంతో ఇప్పటికే మరుగుదొడ్లు మరమ్మతులు చేశాం. త్వరలో డాక్టర్ భార్గవవర్ధన్‌రెడ్డి, డాక్టర్ విజయభాస్కర్‌రెడ్డిల సహకారంతో బస్‌షెల్టర్ నిర్మించనున్నాం. జిందాల్ కంపెనీ ఆధ్వర్యంలో టాయిలెట్లు నిర్మించనున్నాం. త్వరలో వంద వసతి గృహాలను నిర్మిస్తాం. – కాపు చంద్రశేఖర్‌రెడ్డి, ఈఓ, మహానంది -
నాణ్యత మహానందీశుడికెరుక !
మహానంది: మహానంది క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. పట్టుమని ఆరునెలలు కూడా కాకముందే రాజగోపురం ముందు భాగంలో రెండు సుపథ మండపాల మధ్యలో గ్రీనరీ కోసం యూ ఆకారంలో నిర్మించిన గోడ బుధవారం కూలిపోయింది. గోడల మధ్యలో వేసిన మట్టికి పైప్ ద్వారా నీరు పడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, చిన్నపాటి నీటి ఫోర్స్‌కే ఇలా జరగడంతో నిర్మాణాల్లో నాణ్యతపై స్ధానికులు, భక్తులు పెదవి విరుస్తున్నారు. దీనిపై ఈఓ మల్లికార్జునప్రసాద్ మాట్లాడుతూ సిబ్బంది ఫైర్ ఇంజన్లకు వాడే పైపుతో నీరు పట్టడం ద్వారా ఫోర్స్‌కు గోడ కూలిపోయిందని బాధ్యులపై చర్యలు తీసుకుంటానని చెప్పారు. కాగా ఈ గోడ నిర్మాణానికి సుమారు రూ. 55 వేలకు పైగా ఖర్చు చేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. -
నీళ్లల్లో మహానంది
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లో వాగులు, వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ఒంగోలు, గుంటూరు, ఏలూరు నగరాల్లో లోతట్టు, శివారు ప్రాంతాలు నీటమునిగాయి. కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం మహానందితోపాటు నంద్యాల పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. పశ్చిమ గోదావరిలో పిడుగుపడి మహిళ మృతి చెందగా.. ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వైఎస్సార్ జిల్లాలో ఆటో కొట్టుకుపోవడంతో అందులో ఉన్న దంపతులతోపాటు రెండేళ్ల చిన్నారి గల్లంతైంది. కర్నూలు జిల్లా కానాల గ్రామానికి చెందిన ఓబులేసు, రవి, నాగిరెడ్డి పాలేరు వాగు దాటేందుకు వెళ్లి వరద ఉధృతికి కొట్టుకుపోయారు. అయితే అదృష్టవశాత్తు సురక్షితంగా బయటపడ్డారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు/సాక్షి ప్రతినిధి, కడప/సంజామల/సాక్షి, నెట్వర్క్: గుంటూరులో లోతట్టు, శివారు కాలనీలు నీటమునిగాయి. సత్తెనపల్లి–హైదరాబాద్ మార్గంలోని రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద ప్రధాన రహదారిపై వాగు పొంగిపొర్లడంతో వందల్లో వాహనాలు ఆగిపోయాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పొదలకుంటపల్లిలో పిడుగుపడటంతో ముగ్గురు కూలీలు తీవ్ర గాయాలపాలయ్యారు. దిగువ మెట్ట వద్ద కాచిగూడ రైలు నిలిచిపోయింది. గాజులపల్లె సమీపంలో రైల్వే ట్రాక్‌పై నీరు చేరడంతో పలు రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరులో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కుక్కునూరు మండలం కొండపల్లిలో పొలం పనిలో ఉన్న సుజాత అనే మహిళ పిడుగు పడి మృతి చెందింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, విజయనగరం జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది. కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం కలగర పంచాయతీ పరిధిలో పిడుగు పడటంతో 20 గొర్రెలు మృతి చెందాయి. ఈ ప్రమాదంలో గొర్రెల కాపరి వెంకటేశ్వరరావు చెయ్యి కాలిపోయింది. దాములూరు కూడలి కాజ్‌వేపై వరదనీరు ప్రవహిస్తుండటంతో నందిగామ – వీరులపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కోడూరు మండలం పాలకాయతిప్పలో మత్స్యకారులు వేటకు వెళ్లగా వరద ఉధృతికి బోటు తిరగపడింది. దీంతో ఐదుగురు మత్స్యకారులు బోటుపైకి ఎక్కి సమాచారం ఇవ్వటంతో పాలకాయతిప్ప మత్స్యకారులు, మెరైన్ పోలీసులు వారిని ఒడ్డుకు తీసుకువచ్చారు. సీమలో ఉప్పొంగిన వాగులు, వంకలు వైఎస్సార్ జిల్లాతోపాటు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో పెన్నా, కుందూ నదులు పొంగి ప్రవహించాయి. జమ్మలమడుగు, కడప ప్రాంతాలకు పెద్ద ఎత్తున వరద నీరు చేరి వాగులు, వంకలు ఉప్పొంగాయి. పలు చెరువులు తెగిపోయాయి. రోడ్లు కోతకు గురయ్యాయి. కుందూ వరద ఉధృతికి అల్లాడుపల్లె దేవలాలు, కామనూరు కాజ్‌వేలు నీటితో మునిగాయి. బంక చిన్నాయపల్లె గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షాలకు ప్రొద్దుటూరు డివిజన్లో 150 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. 60 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినగా సుమారు రూ.8 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలతో జిల్లావ్యాప్తంగా 660 హెక్టార్లలో పత్తి, 906 హెక్టార్లలో వరి, 120 హెక్టార్లలో జొన్న, 25 హెక్టార్లలో మొక్కజొన్నతోపాటు అరటి, పూలు, కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. అనంతపురం జిల్లాలో విస్తారంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. 63 మండలాల పరిధిలో ఒక్క రోజులోనే 25 మి.మీ సగటు వర్షపాతం నమోదు కావడం గమనార్హం. కర్నూలు జిల్లా నంద్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలో భారీ వర్షాలతో పరిస్థితి అతలాకుతలంగా మారింది. నంద్యాల పట్టణంతోపాటు గ్రామాలను, పంట పొలాలను, రహదారులను వరద నీరు ముంచెత్తుతోంది. జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి, ఎస్పీ ఫక్కీరప్ప నంద్యాలలోనే మకాం వేసి వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వరద ప్రభావిత గ్రామాల్లో భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్నారు. నంద్యాలలో శ్యామకాలువ ఉప్పొంగడంతో 30 గృహాలు నీట మునిగాయి. అందులో 40 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. సంజామల మండలం ముదిగేడు, కమలపురి గ్రామాల మధ్య వాగులో 40 మందితో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. ప్రయాణికులు హాహాకారాలు చేయడంతో సమీప గ్రామాల ప్రజలు బస్సు వెనుకవైపు అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. చాగలమర్రి మండలం నేలపాడులో గొర్రెల కాపరులను తీసుకొచ్చేందుకు వెళ్లిన కొండయ్య, దావీదు, మహేష్, వినోద్ అనే వ్యక్తులు వరదనీటిలో చిక్కుకున్నారు. వీరిని అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు కాపాడారు. వైఎస్సార్ జిల్లాలో చిన్నారి సహా దంపతుల గల్లంతు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం కామనూరు వంకలో వరద ఉధృతికి ఆటోలో ప్రయాణిస్తున్న కుటుంబం గల్లంతైంది. వివరాల్లోకెళ్తే.. సోమవారం రాత్రి 11.45 గంటలకు దువ్వూరు నుంచి ఆటోలో చిన్నారితో కలిసి భార్యాభర్తలు ప్రొద్దుటూరు మార్గంలో వెళుతున్నారు. రాధానగర్ సమీపంలోని కామనూరు వంక దాటుతుండగా వరద నీటి ఉధృతికి ఆటో బోల్తాపడటంతో అందులో ఉన్న ముగ్గురూ నీళ్లలో కొట్టుకుపోయారు. నీళ్లలో పడిపోయినా కుమార్తెను మాత్రం తండ్రి వదల్లేదు. చిన్నారిని భుజాన ఎత్తుకొని ఒక చోట ఒడ్డున నిల్చున్నాడు. అతడి భార్య కూడా సమీపంలోని నీటి మోటారు పైపును పట్టుకొని నిల్చుంది. రక్షించండి అంటూ గట్టిగా కేకలు వేయడంతో రాధానగర్, కామనూరు గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. రూరల్ సీఐ విశ్వనాథ్‌రెడ్డి, ఎస్ఐ సునీల్‌రెడ్డి, అగ్నిమాపక శాఖ అధికారి రఘునాథ్ అక్కడికి చేరుకుని నీళ్లలో దూకి వారి వద్దకు వెళ్లే ప్రయత్నం చేయగా సాధ్యం కాలేదు. కొద్దిసేపటి తర్వాత చిన్నారితో సహా భార్యాభర్తలు నీళ్లలో కొట్టుకుపోయారు. గల్లంతైనవారు ఏ ప్రాంతానికి చెందిన వారనేది తెలియాల్సి ఉంది. రబ్బరు బోటు సాయంతో ప్రొద్దుటూరు, కడప అగ్నిమాపక శాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినా వారి ఆచూకీ తెలియలేదు. పెద్దముడియం మండలం మేడిదిన్నెకు చెందిన మైల భాగ్యమ్మ పని నిమిత్తం వెళ్తూ తీగలేరును దాటే ప్రయత్నంలో నీటిలో పడి కొట్టుకుని పోతుండటం చూసి స్థానిక యువకులు కాపాడారు. మహానందీశ్వరుడిని చుట్టుముట్టిన వరద కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం మహానంది దేవాలయం వరద నీటితో నిండిపోయింది. మహానంది కోనేరులు సైతం నీటమునిగాయి. మహానందిలోని రుద్రగుండం కోనేరులో అతిపురాతనమైన పంచలింగాల మండపంలోని ఐదు శివలింగాలు నీట మునిగిపోయాయి. గర్భాలయంలో వెలిసిన మహానందీశ్వరుడి ఎత్తు కంటే ఎక్కువ ఎత్తులో నీళ్లు రావడం చరిత్రలో ఇదే తొలిసారి. రెండు కోనేరులు నిండిపోవడం, నీరంతా రాజగోపురం మార్గం ద్వారా బయటికి రావడంతో ఆలయ ప్రాంగణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. -
బంగారుహారాలు ఇచ్చినా పట్టించుకోరు
సాక్షి, మహానంది: భక్తులు స్వామి వారికి కానుకలిస్తే వెంటనే సంబంధిత రసీదును దాతలకు అందిస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో దీనిని గమనించి ఉంటాం. అయితే మహానందిలో అధికారులు మాత్రం ఇందుకు భిన్నం. ఏడాది గడుస్తున్నా..దాతలకు రసీదులు ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యం ఏంటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అమ్మవారికి చీర ఇచ్చినా రసీదు వెంటనే ఇవ్వరు...లక్షల విలువ చేసే బంగారుహారాలు ఇచ్చినా పట్టించుకోరు. పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో ఓ ఉన్నత ఉద్యోగి, మరో ఇద్దరు చిరుద్యోగులు తమ కనుసన్నల్లోనే అంతా నడిపిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బుధవారం దేవదాయశాఖకు చెందిన అప్రైజర్(బంగారు, వెండి పరీక్షించే నిపుణుడు)తో కాకుండా ప్రైవేటు అప్రైజర్‌తో బంగారు కానుకల నాణ్యత ప్రమాణాలు పరిశీలించడం, అన్నదాన మండపాల్లో తూకాలు వేయడం విమర్శలకు తావిచ్చింది. మహానంది దేవస్థానానికి సుమారు రెండు కిలోల బంగారు, 200 కిలోల వెండి ఆభరణాలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ఇన్ని ఆభరణాలున్నా సరైన లాకర్ లేదు. మహానంది దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న అర్చకుడు మూలస్థానం శివశంకర శర్మ ఈ ఏడాది జనవరి 13వ తేదీన శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి 200 గ్రాముల వెండి వడ్డాణాన్ని అందించారు. 8నెలలు అయినా రసీదును అందించకపోవడం వెనుక పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే గాజులపల్లెకు చెందిన మురళీసోదరులు వెండి పళ్లాన్ని అందించగా పదిసార్లు ఫోన్‌చేస్తే గాని రసీదును అందించలేదు. ఈ రెండు సంఘటనలే అధికారుల పర్యవేక్షణ, నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. మహానందిలో వెలిసిన శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి ఆలయ వేదపండితులు, అర్చకులు, దేవస్థానం ఉద్యోగులు అందరూ కలిసి 108 స్వర్ణ కమలాలను చేయించారు. తయారు చేయించి ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన దేవస్థానం ఈఓకు అందించారు. కానీ ఆ రోజు ఇచ్చిన స్వర్ణ కమలాలకు సంబంధించిన రసీదులను దేవస్థానం సిబ్బంది బుధవారం అర్చకులకు అందివ్వడం చర్చనీయాంశంగా మారింది. అమ్మవారికిచ్చిన చీరలెక్కడో? మహానంది దేవస్థానంలో వెలిసిన శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి భక్తులు చీరలు సమర్పిస్తుంటారు. మహానందికి చెందిన న్యాయవాది గంగిశెట్టి రాజేశ్వరరావు సుమారు రూ. 12వేల విలువైన చీరను అందించారు. అది ఎక్కడుందో నేటికీ అధికారులు చెప్పలేకున్నారు. ఈ చీరే కాకుండా మరో దాత ఇచ్చిన చీర కనిపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహానంది దేవస్థానంలో టెండరుదారులు వారి బకాయిలు చెల్లించే సమయంలో ఇచ్చే రసీదుల్లో సైతం సూపరింటెండెంట్, ఈఓల సంతకాలు ఉండవు. రూ. వెయ్యి అయినా సరే రూ. 5లక్షలైనా సరే కేవలం గుమస్తా మాత్రమే రసీదుల్లో సంతకాలు చేయడం దేవదాయశాఖ చరిత్రలో ఈ ఆలయంలో మాత్రమే ఉంటుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా పనిచేసే ఉద్యోగులే ఇక్కడ కీలకంగా మారడం, వారి కనుసన్నల్లోనే పాలన నడుస్తుండటం ఇందుకు కారణమని తెలుస్తోంది. -
అన్నప్రసాదం అడిగితే అవమానించారు !
మహానంది: దేవుడి సన్నిధిలో నిర్వహిస్తున్న అన్నప్రసాదం తీసుకుంటే పుణ్యం వస్తుందనే భావనతో ప్రసాదంగా కొంచెం అన్నం పెట్టండని అడిగిన భక్తులను అవమానించిన ఘటన మహానంది క్షేత్రంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ ఓల్డ్‌సిటీకి చెందిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులు మహానందీశ్వరుడి దర్శనార్థం మహానందికి వచ్చారు. స్వామి దర్శనం అనంతరం అన్నదాన కేంద్రం వైపు వెళ్లా రు. ప్రసాదంలా ఓ ముద్ద అడిగేందుకు లోపలికి వెళ్తుండగా అక్కడి సిబ్బంది అడ్డుకుంటూ టోకెన్లు లేనివారిని అనుమతించమని, దురుసుగా ప్రవర్తిస్తూ మహిళలని సైతం చూడకుండా తోసేశారు. ప్రసాదంలా ఓ ముద్ద పెడితే చాలని బతిమాలినా వారి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అవమానంగా భావించిన భక్తులు కంటతడిపెట్టి వెళ్లారు. ఈ విషయాన్ని ప్రత్యక్షంగా చూసిన డ్వామా ఏపీడీ రాజారావు వెంటనే ఈఓ సుబ్రహ్మణ్యంకు ఫోన్లో విషయం తెలపడంతో పాటు నేరుగా కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం ఈఓ సంబంధిత సిబ్బందిని పిలిపించి మందలించారు. -
మహానందిలో అపశ్రుతి
మహానంది: మహానంది క్షేత్రంలోని కామేశ్వరీదేవి సన్నిధిలో గురువారం అపశ్రుతి చోటు చేసుకుంది. హారతిపళ్లెంలోని దీపానికి సంబంధించి నిప్పు రవ్వలు ఎగిసి హుండీలో పడడంతో పొగలు వచ్చాయి. భక్తులకు హారతి ఇస్తుండగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు వెంటనే ఆలయానికి చేరుకొని ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హుండీలో ఇసుక పోశారు. హుండీలోని కానుకలు కొంత మేరకు కాలిపోయి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఇక ముందైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. ఈ విషయంపై ఆలయ సూపరింటెండెంట్ ఓ.వెంకటేశ్వరుడు మాట్లాడుతూ దీపం హుండీలో పడలేదని, హారతి పళ్లెంలో ఉన్న చిల్లరను అర్చకుడు హుండీలో వేస్తుండగా దీపానికి ఉన్న వత్తి కాయిన్లకు అతుక్కుని పొగవచ్చి ఉండవచ్చన్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ పెద్దయ్యనాయుడు ఆలయానికి చేరుకుని హుండీలను పరిశీలించడంతోపాటు సీసీ పుటేజీ దృశ్యాలు చూసి వివరాలు తెలుసుకున్నారు. -
మహానంది వద్ద రోడ్డు ప్రమాదం
సాక్షి, నంద్యాల : మహానంది రహదారిలో ఉన్న బుక్కాపురం వద్ద ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. ప్రయాణికుడే డ్రైవర్ వద్దనుంచి ఆటో తాను నడుపుతానంటూ తీసుకొని డ్రైవింగ్ చేసినట్లు ప్రత్యక్ష్య సాక్షులు తెలిపారు. బాధితులందరినీ మండల ఆస్పత్రికి తరలించారు. సత్యనారాయణ, నీరజ, ఆనంద్‌లతో పాటు మరో ఇద్దరు ఈప్రమాదంలో గాయపడ్డారు. వీరంతా తెలంగాణలోని వరంగల్‌కు చెందిన వారిగా గుర్తించారు. సంఘటకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏసీబీ వలలో మహానంది దేవస్థానం ఉద్యోగి
- కాంట్రాక్టర్‌ను రూ. 10 వేలు డిమాండ్ చేసిన డ్రాఫ్ట్స్‌మెన్ - ఏబీసీ అధికారులను ఆశ్రయించిన కాంట్రాక్టర్ - పథకం ప్రకారం పట్టుకున్న వైనం మహానంది: ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ మహానంది దేవస్థానం ఉద్యోగి, డ్రాఫ్ట్స్‌మెన్ సర్వేశ్వరుడు ఆలియాస్ సర్వేశ్వరరావు ఏసీబీ అధికారులకు దొరికాడు. ఏసీబీ కర్నూలు డీఎస్పీ జయరామరాజు తెలిపిన వివరాల మేరకు....మహానంది దేవస్థానంలో 2013లో అన్నదాన భవనం, అభిషేక మండపాల నిర్మాణానికి రూ. 1.98 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిర్మాణాలను నెల్లూరుకు చెందిన రమేష్‌రెడ్డి దక్కించుకున్నారు. ఆయన పేరు మీద తన మిత్రుడు శ్యాంసుందర్‌రెడ్డి పనులు చేశాడు. గత ఏడాది నవంబర్‌లో భవనాలను ప్రారంభించారు. అయితే అప్పటి నుంచి సంబంధిత కాంట్రాక్టర్ శ్యాంసుందర్‌రెడ్డికి రూ. 6 లక్షలు ఎఫ్ఎస్డీ వెనక్కి రావాలి. దీనికి సంబంధించిన బిల్లులు, రికార్డులను ఎం–బుక్‌లో రూపొందించి బిల్లులు తయారు చేసి దేవస్థానం కార్యనిర్వహణాధికారితో సంతకం చేయించాల్సి ఉంది. అయితే ఈ పనులకు డ్రాఫ్ట్స్‌మెన్ సర్వేశ్వరుడు రూ. 10 వేలు డిమాండ్ చేయడంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు పథకంలో భాగంగా సోమవారం స్థానిక అన్నదానం భవనం వద్ద కాంట్రాక్టర్ శ్యాంసుందర్‌రెడ్డి ఉద్యోగికి ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ జయరామరాజు తెలిపారు. దాడుల్లో ఏసీబీ సీఐలు సీతారామారావు, కృష్ణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీశైలంలోనూ అవినీతి ఆరోపణలు: డ్రాఫ్ట్స్‌మెన్ సర్వేశ్వరుడు ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా శ్రీశైలం నుంచి మహానందికి వచ్చారు. అయితే ఆయన శ్రీశైలం దేవస్థానంలో పనిచేసే సమయంలోనూ ఆయనపై పలు అవినీతి ఆరోపణలు వచ్చినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. గతంలో ‘సాక్షి’లో సైతం లోగుట్టు సర్వేశ్వరుడికెరుక అన్న శీర్షికతో అతని అక్రమాలపై కథనం ప్రచురించింది. మహానంది దేవస్థానంలో పనిచేస్తూ ఓ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరకడం ఇదే ప్రథమం కావడంతో స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. -
నందీశ్వరుడికి వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు
-
నందీశ్వరుడికి వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు
మహానంది : కర్నూలు జిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న వైఎస్ జగన్ మంగళవారం మహానంది మండలంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మహానందీశ్వరాలయాన్ని ఆయన సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన జగన్ ఆర్చకులు ఘనస్వాగతం పలికారు. పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. జిల్లాలో వైఎస్ జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్ర నేటికి ఆరో రోజుకు చేరిన విషయం తెలిసిందే. -
మహానంది ఆలయ ఉద్యోగుల సస్పెన్షన్
మహానంది (కర్నూలు) : బాధ్యతలను మరిచిన ఇద్దరు ఆలయ ఉద్యోగులు సస్పెన్షన్‌కు గురయ్యారు. కర్నూలు జిల్లా మహానంది ఆధ్యాత్మిక క్షేత్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో విధులకు హాజరైన మద్దిలేటి అనే ఉద్యోగితోపాటు, విధుల్లో అలసత్వం వహించిన అర్జునశర్మను సస్పెండ్ చేస్తూ గురువారం ఆలయ ఈవో శంకరవరప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. -
మహానందికి పోటెత్తిన భక్తులు
మహానంది: కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తజనంతో మహానంది క్షేత్రం కిటకిటలాడింది. పవిత్ర కార్తీకమాసంలో దీపం, దానం, స్నానం ఎంతో ప్రధానమైనవి. ఈ మాసంలో వేకువజామునే పుణ్యస్నానాలు ఆచరించి ముక్కంటీని దర్శించుకోవడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వేకువజాము నుంచి దర్శనాలు ప్రారంభం కావడంతో శ్రీకామేశ్వరీదేవీ సహీత మహానందీశ్వరస్వామివార్ల దర్శనార్థం భక్తులు బారులు తీరారు. స్థానిక కోనేరులలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించారు. శ్రీకామేశ్వరీదేవీ సహీత మహానందీశ్వర, వినాయకనంది, గరుడనంది, సూర్యనంది ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహానంది క్షేత్రానికి వచ్చిన భక్తులు వర్షంతో తీవ్ర అవస్థలు పడ్డారు. అధికారులు ఎలాంటి ప్రత్యేక చర్యలు చేపట్టకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మహానంది ఆలయ ఉద్యోగుల సస్పెన్షన్
కర్నూలు : కర్నూలు జిల్లా మహానందిలోని శ్రీ మహానందీశ్వర స్వామి దేవస్థానంలో దర్శనం టికెట్లు, లడ్డూ టికెట్ల విక్రయాల సొమ్మును దుర్వినియోగం చేసిన కేసులో ఇద్దరి ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. సదరు సొమ్మును ఉద్యోగులు సుబ్బారెడ్డి, ఈశ్వరయ్యలు సొంత అవసరాలకు వాడుకున్న ప్రాథమిక విచారణలో తెలింది. దాంతో ఆ ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఈవో శంకరవరప్రసాద్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. అలాగే వారిద్దరికి సహకరించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులు గురవయ్య, మధుమహేశ్, ప్రవీణ్‌లను విధుల నుంచి తొలగిస్తూ ఈవో శంకరవర ప్రసాద్ నిర్ణయం తీసుకున్నారు. -
రేపు శివరాత్రి ఏర్పాట్లకు టెండర్లు
మహానంది, న్యూస్‌లైన్ : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానంది క్షేత్రంలో చేపట్టాల్సిన ఏర్పాట్ల కోసం టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఇన్చార్జ్ ఈఓ, డీసీ కేవీసాగర్‌బాబు తెలిపారు. ఇందుకు సంబంధించి ఈ నెల 7, 18 తేదీల్లో రెండు విడతలుగా టెండర్లు పిలుస్తామని ఆయన చెప్పారు. దేవస్థానం కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భక్తులకు కల్పించాల్సిన వసతులు, ఇతర ఏర్పాట్లకు సంబంధించి ఈ నెల 7న టెండర్లు నిర్విహ స్తామన్నారు. మహాశివరాత్రి, ఉగాది పర్వదినాల సందర్భంగా విద్యుత్ దీపాలంకరణ ఏర్పాట్ల టెండర్లలో పాల్గొనేవారు రూ. 25వేల డిపాజిట్ చెల్లించాలన్నారు. చలువపందిళ్లు, షామియానాల ఏర్పాటు, సున్నపుపూత పనులు, తాగునీటి వసతి కల్పన, స్వామివారి కల్యాణవేదిక, స్వాగతతోరణం, వేదిక ముందు కూర్చునేందుకు పందిరి, క్యూలైన్లు, పార్కింగ్ స్థలాల ఏర్పాటు, జంగిల్ క్లియరెన్స్, ఇతర పనులకు ఇదే రోజు టెండర్లు నిర్వహిస్తామన్నారు. నవగ్రహాల వద్ద దీపారాధనకు కావాల్సిన సామగ్రి సరఫరా, అభిషేక సామగ్రి విక్రయ కేంద్రం, పూలదుకాణం ఏర్పాటు, తలనీలాల సేకరణ, నందివిగ్రహం వద్ద ఫొటోలు తీసుకునే హక్కు తదితరవాటికి సంబంధించి ఈ నెల 18వతేదీన టెండర్లుంటాయని సాగర్‌బాబు తెలిపారు. స్థల పరిశీలన.. క్షేత్రంలో ఓ కమ్యూనిటికి చెందిన అన్నసత్రం నిర్మాణం కోసం అవసరమైన స్థలాన్ని ఈఓ ఆదివారం పరిశీలించారు. సూపరింటెండెంట్ మధు, వీఆర్ఓ శ్రీకాంతరావు, రెవెన్యూ సిబ్బందితో కలిసి స్థలాన్ని పరిశీలించిన ఆయన పూర్తి వివరాలు తెలుసుకున్నారు.