కర్నూలు : కర్నూలు జిల్లా మహానందిలోని శ్రీ మహానందీశ్వర స్వామి దేవస్థానంలో దర్శనం టికెట్లు, లడ్డూ టికెట్ల విక్రయాల సొమ్మును దుర్వినియోగం చేసిన కేసులో ఇద్దరి ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. సదరు సొమ్మును ఉద్యోగులు సుబ్బారెడ్డి, ఈశ్వరయ్యలు సొంత అవసరాలకు వాడుకున్న ప్రాథమిక విచారణలో తెలింది.
దాంతో ఆ ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఈవో శంకరవరప్రసాద్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. అలాగే వారిద్దరికి సహకరించిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు గురవయ్య, మధుమహేశ్, ప్రవీణ్‌లను విధుల నుంచి తొలగిస్తూ ఈవో శంకరవర ప్రసాద్ నిర్ణయం తీసుకున్నారు.