సనత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్‌ వేటు | Sanathnagar SHO suspended after woman files complaint | Sakshi
Sakshi News home page

సనత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్‌ వేటు

Jul 21 2024 8:10 AM | Updated on Jul 21 2024 8:13 AM

Sanathnagar SHO suspended after woman files complaint

ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో చాటింగ్‌ 

 సీపీని ఆశ్రయించి ఆధారాలు 

సమరి్పంచిన బాధితురాలు  

తక్షణం చర్యలు తీసుకున్న సైబరాబాద్‌ సీపీ   

సనత్‌నగర్‌: సనత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ పురేందర్‌రెడ్డి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఓ కేసు విషయమై ఫిర్యాదు చేసేందుకు వచి్చన మహిళతో చాటింగ్‌ చేస్తూ అసభ్యకర మెసేజ్‌లు పంపించడంపై ఇన్‌స్పెక్టర్‌పై సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి తక్షణ చర్యలు తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మూడు నెలల క్రితం సనత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌గా పురేందర్‌రెడ్డి బదిలీపై వచ్చారు. ఇటీవల ఓ మహిళ ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. 

ఈ నేపథ్యంలో పురేందర్‌రెడ్డి ఆమెతో ఫోన్‌లో చాటింగ్‌ చేయడం మొదలుపెట్టారు. ‘నువ్వు అందంగా ఉన్నావు.. నేను చెప్పిన చోటికి రావాలి’ అంటూ అసభ్య పదజాలంతో మెసేజ్‌లు పంపించారు. దీంతో బాధితురాలు సైబరాబాద్‌ కమిషనర్‌ అవినాష్‌ మహంతిని నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. 

ఇన్‌స్పెక్టర్‌ అభ్యంతరకరంగా చేసిన చాటింగ్‌ సందేశాలను ఆధారాలతో కమిషనర్‌కు ఆమె చూపించారు. దీంతో ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్‌ చేశారు. పోలీసు శాఖలో దుష్ప్రవర్తనను సహించేది లేదన్న బలమైన సందేశాన్ని సీపీ పంపించారు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించే పౌరులకు, ముఖ్యంగా మహిళలకు సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని అందించేలా ఒక భరోసా కలిగించేలా సీపీ చర్యలు తీసుకున్నారని పలువురు అభిప్రాయపడ్డారు. 
 
నూతన ఇన్‌స్పెక్టర్‌గా శ్రీనివాసులు.. 
సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ నూతన ఇన్‌స్పెక్టర్‌గా కె.శ్రీనివాసులును నియమిస్తూ సీపీ అవినాష్‌ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. కూకట్‌పల్లి ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసులు.. ఉత్తర్వులు వెలువడిన వెంటనే శనివారం సాయంత్రం సనత్‌నగర్‌ ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు స్వీకరించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement