
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, నంద్యాల : మహానంది రహదారిలో ఉన్న బుక్కాపురం వద్ద ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. ప్రయాణికుడే డ్రైవర్ వద్దనుంచి ఆటో తాను నడుపుతానంటూ తీసుకొని డ్రైవింగ్ చేసినట్లు ప్రత్యక్ష్య సాక్షులు తెలిపారు. బాధితులందరినీ మండల ఆస్పత్రికి తరలించారు. సత్యనారాయణ, నీరజ, ఆనంద్‌లతో పాటు మరో ఇద్దరు ఈప్రమాదంలో గాయపడ్డారు. వీరంతా తెలంగాణలోని వరంగల్‌కు చెందిన వారిగా గుర్తించారు. సంఘటకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.