మహానంది (కర్నూలు) : బాధ్యతలను మరిచిన ఇద్దరు ఆలయ ఉద్యోగులు సస్పెన్షన్‌కు గురయ్యారు. కర్నూలు జిల్లా మహానంది ఆధ్యాత్మిక క్షేత్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో విధులకు హాజరైన మద్దిలేటి అనే ఉద్యోగితోపాటు, విధుల్లో అలసత్వం వహించిన అర్జునశర్మను సస్పెండ్ చేస్తూ గురువారం ఆలయ ఈవో శంకరవరప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.