
ఎల్.ఎన్.పేట: కిలో వంకాయలు రూ.100కు అమ్ముతున్నారు. కార్తీక మాసం కావటంతో భక్తులు మాంసాహారం మాని శాఖాహార భోజనం వైపు చూస్తున్నారు. కొన్ని రోజుల క్రితం కిలో రూ.20 నుంచి రూ.40ల మధ్య ఉన్న కూరగాయల ధరలు ప్రస్తుతం రూ.80 నుంచి రూ.100కు చేరుకున్నాయి. తాజాగా, సోమవారం మార్కెట్‌లో కిలో వంకాయల ధర రూ.100 పలకడంతో వినియోగదారులు అవాక్కవుతున్నారు