
భీమవరం(ప్రకాశం చౌక్)/పాలకొల్లు సెంట్రల్: కార్తీకమాసం తొలి సోమవారానికి పశ్చిమగోదావరి జిల్లాలోని పంచారామక్షేత్రాలైన భీమవరం గునుపూడి లోని ఉమాసోమేశ్వర జనార్దనస్వామి ఆల యం (సోమారామం), పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయం (క్షీరారామం) ముస్తాబయ్యాయి. భీమవరంలో క్షేత్రానికి వేకువజాము నుంచి భక్తుల తాకిడి ఉంటుందని, సుమారు 50 వేల మంది భక్తులు వస్తా రనే అంచనాతో ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈఓ ఎం.అరుణ్‌కుమార్ తెలిపారు. ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాట్లు చేశామని, ఉచిత దర్శనంతో పాటు రూ. 50, రూ.100 ప్రత్యేక దర్శనా లు కల్పిస్తామన్నారు. ఆలయం వెనుక వైపు స్వామికి అభిషేకాలు, కార్తీక నోములు నోచు కునే ఏర్పాట్లు చేశామన్నారు. అన్నదాన కమి టీ ఆధ్వర్యంలో అన్నదానం చేస్తామని, పోలీసు, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఆదివారం అధిక సంఖ్యలో.. ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు జరిగాయి.
క్షీరారామం.. శోభాయమానం
పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ట్రస్ట్‌బోర్డ్ చైర్మన్ కోరాడ శ్రీనివాసరావు, ఈఓ యాళ్ల సూర్యనారాయణ ఆదివారం ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయం వెలుపల ప్రాకారం లోపల ఉన్న గోశాల వద్ద కార్తీక దీపాలు వెలిగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక దర్శనం టికెట్ కౌంటర్లు ఆంజనేయస్వామి ఆలయం పక్కన, సర్వదర్శనం క్యూలైన్లు దేవస్థానం కార్యాలయం పక్కనున్న మండపం వద్ద కేటాయించారు. ప్రసాదం విక్రయాలను ప్రత్యేక క్యూలైన్ పక్కన అలాగే సేవా సంస్థలు, దాతలు పా లు, ప్రసాదాలను ఆలయం బయట ఉత్తరం గేటు వద్ద భక్తులకు అందించేలా చర్యలు తీసుకున్నారు. వేకువజామున కార్తీక దీపాలు వెలిగించడంతో పాటు దీప, ఉసిరి, సాలగ్రామ, వస్త్ర, గోదానాలు ఇచ్చే భక్తుల కోసం ఆలయ ఉత్తర భాగంలో గోశాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. పంచారామ యాత్రికుల వాహనాల పార్కింగ్‌కు బస్టాండ్ వెనుక సంత మార్కెట్ రోడ్డు, మార్కెటింగ్ యార్డు రోడ్డు వద్ద స్థలాలను కేటాయించారు. క్షేత్రంలో పూర్తిస్థాయిలో ఏర్పాట్లను చేసినట్టు ఆలయ చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment