ఓ మహిళ సహా ముగ్గురు చిన్నారులు గోదావరి నదిలో గల్లంతయ్యారు.
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వేలేరుపాడు మండలం కోయిదా గ్రామం వద్ద గోదావరిలో స్నానానికి దిగిన నలుగురు మృతిచెందారు.
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రానికి చెందిన 22 మంది రెండు ఆటోల్లో పిక్నిక్‌కు కోయిదా వచ్చారు. నదిలో స్నానాలు చేస్తున్న క్రమంలో నలుగురు నీట మునిగి మృతిచెందారు. మృతుల్లో ఎస్కే అరిఫా(45), మెహబూబీ(12), హసీమా(11) అనే ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మద్ది కొండమ్మ(36) అనే మహిళ మృతదేహాం కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో అశ్వారావుపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.