సాక్షి, అమరావతి: కార్తీక మాసం శుక్రవారం నుంచి ప్రారంభం కావడంతో శైవ క్షేత్రాలలో భక్తుల సందడి మొదలైంది. ప్రధాన శైవ క్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, మహానందితోపాటు పంచారామాలలోనూ భక్తుల రద్దీ నెలకొంది. పంచారామాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలకు భక్తుల పోటెత్తారు. తెల్లవారుజామునుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న మల్లికార్జునస్వామిని కూడా దర్శించుకుంటున్నారు. ముందుగా కృష్ణానదిలో స్నానాలాచరించి దీపారాధనలు చేసుకుని స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. తెలంగాణలోని కాళేశ్వరం, వేములవాడల్లోకూడా భక్తుల రద్దీ నెలకొంది. భద్రాచలంలోనూ భక్తులు ఎక్కువ సంఖ్యలో సీతారామలక్ష్మణులను దర్శించుకున్నారు. పవిత్ర గోదావరిలో స్నానాలాచరించి దీపారాధనలు, దీపదానాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment