కార్తీకంలో ఆకాశదీపం ఎందుకు వెలిగిస్తారు ? | Do You Know Akasa Deepam On Karthika Masam And Its Importance | Sakshi
Sakshi News home page

కార్తీకంలో ఆకాశదీపం ఎందుకు వెలిగిస్తారు ?

Published Mon, Nov 4 2024 12:06 PM | Last Updated on Mon, Nov 4 2024 12:21 PM

Do You Know Akasa Deepam On Karthika Masam And Its Importance

ఈ కార్తీకమాసం అంటే పుణ్య మాసం అనే చెప్పాలి. ఈ నెల శివకేశవులకి ఎంతో ప్రియమైనది. అంతేకాదు ఈ సమయంలో వారికి పూజలు అభిషేకాలు వ్రతాలు చేస్తూ ఉంటారు.  కార్తీకమాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజ స్తంభానికి ఆకాశ దీపం వెలాడదీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేసిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనెపోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. 

ఇది ప్రతీ శివాలయం లో వెలిగించడం మనకు కనిపిస్తుంది. గుడికి వెళ్లిన సమయంలో ఆకాశ దీపాన్ని చూసి నమస్కరిస్తారు అందరూ. ఇలా చేయడం వల్ల పితృదేవతలకు మార్గం చూపుతుంది అని నమ్మకం. దానిని తాడు సాయంతో పైకి పంపించి, ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు. ఇలా ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని వారికి దారి కోసం అని కార్తీకపురాణం చెబుతోంది. 

ఇలా ఆ దీపాన్ని చూసినా తలచుకున్నా ఎంతో మంచిది మనలో ఉన్న నెగిటీవ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఆ కాంతిలో ఆ ప్రాంతం అంతా ఆ శివయ్య కాపాడుతాడు అని కూడా నమ్ముతారు. ఇక ఇంట్లో కూడా ఇలా ఆకాశదీపం వెలిగించవచ్చు. ఎత్తుగా ఒక కర్రకట్టి దానికి వేలాడదీయవచ్చు అని పెద్దలు పండితులు చెబుతారు, కొందరు ఇళ్లల్లో కూడా దీనిని కడతారు.

(చదవండి: కార్తీకం.. పరమ పవిత్రం)

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement