
సాక్షి, కరీంనగర్ : భూదందాలతో డబ్బులు దండుకున్న వారు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌లోని పలు డివిజన్లలో రోడ్ షో తో మంత్రి గంగుల కమలాకర్ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకొని టిఆర్ఎస్‌కే ఓటు వేయాలని సూచించారు. నాయకులను పిలిచి మరీ.. ఓటుకు రెండు వేలు తీసుకోవాలని మంత్రి ఓటర్లకు తెలిపారు. ఎన్నికల్లో పంచె డబ్బులు మనవేనని, కాదనకుండా తీసుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment