
ఎలబోతారంలో పాదయాత్ర చేస్తున్న బండిసంజయ్
సాక్షి, కరీంనగర్‌రూరల్ : సీఎం కేసీఆర్ కుటుంబ అధికారాన్ని కాపాడుకునేందుకు ఎంఐఎం మద్దతుతో ముందస్తు ఎన్నికలకు వెళ్లాడని బీజేపీ కరీంనగర్ నియోజకవర్గ అభ్యర్ధి బండి సంజయ్‌కుమార్ అన్నారు. కరీంనగర్ మండలం ఎలబోతారంలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించాల్సిందిగా కోరారు. మాజీ సర్పంచ్ సుంచు లక్ష్మినర్సయ్య బీజేపీలో చేరగా సంజయ్ కండువా కప్పి ఆహ్వానించారు. బీజేపీ మండలాధ్యక్షుడు దాసరి రమణారెడ్డి, పబ్బతి సతీశ్‌రెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, గందె మల్లారావు, దేవేందర్, గోపాల్, వి.శ్రీనివాస్, కొమురయ్య, చంద్రయ్య, కరుణాకర్‌రెడ్డి, ఆంజనేయులు, సాయి తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్‌సిటీ : నగరంలోని 33వ డివిజన్ రాంన గర్, మార్కండేయనగర్, శివనగర్, ప్రగతినగర్ ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఇంటింటా ప్రచారం చేశారు. దేశంలోనే అత్యంత పెద్ద బస్సు ప్రమాదసంఘటన రాష్ట్రంలోని కొండ గట్టు వద్ద జరిగిందని ఆ ప్రమాదంలో మృతి చెందిన పేదల కోసం కొండగట్టు రాని కేసీఆర్ నేడు ఓట్ల కోసం ఎలా వచ్చారని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment