సాక్షి, కరీంనగర్ : కరీంనగర్‌లో పర్యటనకు వచ్చిన ఇండోనేషియా వాసులకు ఆశ్రయం ఇచ్చిన మహమ్మద్ జమీల్ అహ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల కొరకు నగరంలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అయితే పరీక్షల్లో జమీల్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కి వచ్చిన 9మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారైన విషయం తెలిసిందే. ఇండోనేషియా బృందానికి బస ఏర్పాటు చేసిన జమీల్ అహ్మద్ కొన్ని రోజుల పాటు పోలీసులకు దొరకుండా తప్పించుకుని తిరిగారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వైరస్ సోకిందన్న అనుమానంతో వైద్య పరీక్షలుకు తరలించారు. మరోవైపు జమీల్‌పై అధికారులు ఆసుపత్రిలోనే విచారణ జరుపుతున్నారు. (వందేళ్లకో మహమ్మారి..)
అదేవిధంగా కరీంనగర్‌లో జనతా కర్ఫ్యూను నగర సీపీ కమలాసన్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వచ్ఛందంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమై ‘జనతా కర్ప్యూ’కి సహకరిస్తున్నారని తెలిపారు. రోడ్ల మీదికి ఎవరూ రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారని చెప్పారు. ఇండోనేషియాకు చెందిన తొమ్మిది మందికి ఆశ్రయం కల్పించి కరోనా పాజిటివ్ తెచ్చుకున్న కరీంనగర్‌కు చెందిన మహమ్మద్ జమీల్ అహ్మద్‌ను శనివారం రాత్రి పట్టుకున్నామని ఆయన వెల్లడించారు. అతన్ని బైండోవర్ చేశాక మూడు రోజులుగా తప్పించుకుని తిరిగాడని కమలాసన్‌రెడ్డి తెలిపారు. జమీల్‌కు కరోనా లక్షణాలు కనిపించడంతో ఉండడంతో ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్ వార్డుకు తరలించామని సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. (జనతా కర్ఫ్యూ: లైవ్ అప్‌డేట్స్)
చదవండి: ఇంట్లో ఉండకపోతే.. ఆస్పత్రిలో వేస్తారు!
చదవండి: రామగుండంలో ‘కరోనా’ దడ!
Comments
Please login to add a commentAdd a comment