పెద్దపల్లి: నాయకుడి పూజలు ఫలించేనా? | The Worshiper Of The Leader? | Sakshi
Sakshi News home page

పెద్దపల్లి: నాయకుడి పూజలు ఫలించేనా?

Published Mon, Dec 3 2018 2:54 PM | Last Updated on Mon, Dec 3 2018 3:14 PM

 The Worshiper Of The Leader? - Sakshi

 పూజలు చేస్తున్న మనోహర్‌రెడ్డి 

సాక్షి,పెద్దపల్లి: పట్టణంలోని పలు ఆలయాల్లో ఆదివారం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీలక్ష్మిగణపతి,సంతోషిమాత, చాముండీశ్వరీ ఆలయాల్లో పూజలు చేశారు. ఆయన వెంట మున్సిపల్‌ చైర్మన్‌ రాజయ్య, నాయకులు కొట్టె సదానందం, మర్రిపల్లి సతీష్‌ తదితరులున్నారు.

పెద్దపల్లి: దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతం ఆంధ్రా పాలకుల కారణంగా నిరాదరణకు గురైందని, రాష్ట్రాన్ని సాధించి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మాత్రమేనని దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. సుల్తానాబాద్‌ మండలం కనుకుల, కాల్వశ్రీరాంపూర్‌ మండలం కూనారం గ్రామాలకు చెందిన కాంగ్రెస్‌ గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు దాసరి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మైలారపు నారాయణ, నూనె కుమార్, కుంభం సంతోష్, మోహన్‌రావు, కొండాల్‌రెడ్డి, పెద్ది రాజేషం పాల్గొన్నారు. 


చేరిక
ఎలిగేడు: నారాయణపల్లి, సుల్తాన్‌పూర్, లాలపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్‌ నాయకులు దాసరి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మల్లారాపు మల్లేశం(సుల్తాన్‌ఫూర్‌), సబ్బు తిరుపతి(నారాయణపల్లి), గట్టు రాజు, ముద్రవేని ఓదెలు, కవ్వంపల్లి సుమన్‌(సుల్తాన్‌పూర్‌), తీపిరెడ్డి రాంరెడ్డి(లాలపల్లి)తోపాటు వారి అనుచర వర్గం టీఆర్‌ఎస్‌లో చేరినట్లు నాయకులు పేర్కొన్నారు. మోహన్‌రావు, కొండాల్‌రెడ్డి, రాజేశం, రాయనర్సయ్య, తిరుపతిరెడ్డి, రాజేశం, కొండ వెంకన్న, రాజకొమురయ్య, వెంకటేశ్‌ పాల్గొన్నారు.

పెద్దపల్లి నియోజకవర్గం వార్తల కోసం...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement