
ఓటు అభ్యర్థిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్‌సింగ్
సాక్షి, గోదావరిఖని: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ హామీ ఇచ్చారు. గురువారం స్థానిక లక్ష్మీనగర్‌లో, కళ్యాణ్‌నగర్‌లో ఆయన ప్రచారంలో భాగంగా వ్యాపారస్తులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అందరికి అనుగుణంగా ఉందన్నారు. ఈ ప్రాంత ప్రజలపై విశ్వాసంతో సేవ చేస్తూ, వస్తున్నానన్నారు. డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మహంకాళి స్వామి, గుమ్మడి కుమారస్వామి, రియాజ్ అహ్మద్, గోపాల్‌రావు, తిప్పారపు శ్రీను, బాలరాజ్‌కుమార్, పొన్నం విజయ్‌కుమార్, చిదురాల రవీందర్, నర్సిన సంతోష్ పాల్గొన్నారు.
పద్మశాలీల అభ్యున్నతికి కృషి
పద్మశాలీల అభ్యున్నతికి కృషి చేస్తానని మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ హామీ ఇచ్చారు. స్థానిక ఓ ఫంక్షన్ హాల్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో తనను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కులబాంధవులు ఆయనకు మద్దతు ప్రకటించారు. నాయకులు వేముల రాంమూర్తి, కౌశిక్‌హరి, మండల సత్యనారాయణ, కొలిపాక సుజాత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment