Makkansing Rajatakur
-
గోదావరిఖని: నిరుద్యోగ యువతకు ఉపాధి
సాక్షి, గోదావరిఖని: ఈనెల 7న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు చూపిస్తానని కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ హామీ ఇచ్చారు. బుధవారం గోదావరిఖని రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈనెల 7న జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఫైవింక్లయిన్ మీదుగా తిలక్‌నగర్, జవహర్‌నగర్, లక్ష్మీనగర్, మెయిన్ చౌరస్తా, ఎన్టీపీసీ మీదుగా రామగుండం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే జీఎంకాలనీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్‌సింగ్‌ను గెలిపించాలని గాదం విజయ ఆధ్వర్యంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మక్కాన్‌సింగ్ కూతురు మానసఠాకూర్, నాయకులు పున్నం స్వరూప, భైరి లావణ్య, రజిత, మౌనిక, శ్రీలత, స్వరూప, స్వప్న, తిరుమల, ఈశ్వరమ్మ పాల్గొన్నారు. జ్యోతినగర్: కాంగ్రెస్ పార్టీ విజయంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రామగుండం అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ అన్నారు. బుధవారం రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టు లేబర్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు పేదలకు అందేవిధంగా మీకు సేవ చేస్తానని ప్రకటించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేలా యాజమాన్యంతో చర్చించనున్నట్లు వెల్లడించారు. చేతి గుర్తుకు ఓటు వేసి గెలించాలని అభ్యర్థించారు. కార్పొరేటర్లు కొలిపాక సుజాత, కవితారెడ్డి, పద్మలత, బాబర్ సలీంపాషా, బండి తిరుపతి, జిమ్మి బాబు, కళ్యాణ్, అరుణ్‌కుమార్, సంపత్‌రావు పాల్గొన్నారు. -
గోదావరిఖని: సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
సాక్షి, గోదావరిఖని: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ హామీ ఇచ్చారు. గురువారం స్థానిక లక్ష్మీనగర్‌లో, కళ్యాణ్‌నగర్‌లో ఆయన ప్రచారంలో భాగంగా వ్యాపారస్తులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అందరికి అనుగుణంగా ఉందన్నారు. ఈ ప్రాంత ప్రజలపై విశ్వాసంతో సేవ చేస్తూ, వస్తున్నానన్నారు. డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మహంకాళి స్వామి, గుమ్మడి కుమారస్వామి, రియాజ్ అహ్మద్, గోపాల్‌రావు, తిప్పారపు శ్రీను, బాలరాజ్‌కుమార్, పొన్నం విజయ్‌కుమార్, చిదురాల రవీందర్, నర్సిన సంతోష్ పాల్గొన్నారు. పద్మశాలీల అభ్యున్నతికి కృషి పద్మశాలీల అభ్యున్నతికి కృషి చేస్తానని మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ హామీ ఇచ్చారు. స్థానిక ఓ ఫంక్షన్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో తనను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కులబాంధవులు ఆయనకు మద్దతు ప్రకటించారు. నాయకులు వేముల రాంమూర్తి, కౌశిక్‌హరి, మండల సత్యనారాయణ, కొలిపాక సుజాత పాల్గొన్నారు. -
తొమ్మిదేళ్లలో అభివృద్ధి శూన్యం
గోదావరిఖని : కాంగ్రెస్ పార్టీతో రామగుండం నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే అభ్యర్థి మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. గురువారం స్థానిక సిరి ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రైస్తవుల ప్రార్థనలతో ఆశీర్వాదం పొందారు. క్రైస్తవులకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు జిమ్మి బాబు, ఫాస్టర్లు జాన్‌సుందర్, జీవరత్నం, ఎలియాస్, ఐజయ్య, నాయకులు జేవీ రాజు పాల్గొన్నారు. పోచమ్మ మైదానంలో కార్పొరేషన్లో పని చేస్తున్న కార్మికులను ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో జీడీకే1వ గనిపై కార్మికులను కలిసి ఓటు అభ్యర్థించారు. ఓల్ట్ అశోక్ లేబర్ అడ్డా వద్ద కార్మికులను కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను వివరించారు. ఎల్ఐసీ కార్యాలయంలో ఉద్యోగులను కలిసి ఓటు వేయాలని కోరారు. వేర్వేరుగా జరిగినకార్యక్రమాలలో నాయకులు కాల్వ లింగస్వామి, బడికెల రాజలింగం, మహంకాళి స్వామి, గుమ్మడి కుమారస్వామి, ఎం.రవికుమార్, తిప్పారపు శ్రీనివాస్ పాల్గొన్నారు. కేశోరాంలో ఎన్నికల ప్రచారం పాలకుర్తి: బసంత్‌నగర్ కేశోరాం సిమెంట్ కర్మాగారంలో గురువారం మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, కేశోరాం కార్మికసంఘం అధ్యక్షుడు కౌశికహరితో కలిసి గేట్మీటింగ్ నిర్వహించారు. కార్మికులనుద్దేశించి మాట్లాడుతూ... గడిచిన తొమ్మిదేళ్లలో సోమారపు సత్యనారాయణ హయాంలో నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. రామగుండం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, కాంగ్రెస్‌పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్మికసంఘం ప్రధాన కార్యదర్శి తోడేటి రవికుమార్‌తో పాటు వివిధ గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు. అభ్యర్థులంతా నాన్ లోకల్... రామగుండం: రామగుండం అసెంబ్లీ బరిలో ఉన్న నాయకులందరు స్థానికేతరులేనని, స్థానికులను గుర్తించి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని మక్కాన్‌సింగ్‌ఠాకూర్ అన్నారు. స్థానిక అభ్యర్థిని ఆదరించి వన్‌సైడ్ ఓటింగ్‌తో చరిత్ర సృష్టించాలన్నారు. గురువారం పట్టణంలోని కౌశిక హరి నివాసంలో ప్రచార సరళిపై నియోజకవర్గ పరి ధిలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. సమావేశంలో కేశోరాం కార్మిక సంఘం నాయకుడు కౌశిక హరి, మాజీ ఎంపీపీ బర్పటి కిష్టయ్య, పూదరి సత్తయ్యగౌడ్, ఉరిమెట్ల రాజలింగం, ఇసంపెల్లి అంజులు, గడ్డం శంకర్, గోలివాడ ప్రసన్నకుమార్, మేర్గు పోశం, రామ్‌నాయక్, సూరతార, చల్ల రవీందర్‌రెడ్డి, కేశవరెడ్డిలున్నారు. పతి గెలుపునకు సతి ప్రచారం జ్యోతినగర్: పతి గెలుపు కోసం సతి ప్రచారం చేపట్టారు. రామగుండం అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గెలుపు కోసం ఆయన సతీమణి ప్రసన్న మనాలి ఠాకూర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. న్యూపీకే రామయ్యకాలనీ, అన్నపూర్ణకాలనీ, కృష్ణానగర్ ప్రచారంలో కార్పోరేటర్ దాసరి సావిత్రి, గాదం విజయ, శంకరమ్మ, స్వరూప, రజిత, స్వప్నలతో పాటు ప్రచార కమిటీ కన్వీనర్ నెలకంటి రాము పాల్గొన్నారు. -
నయా ఫ్యూడలిజం నశించాలి..
గోదావరిఖని(రామగుండం) : నయా ఫ్యూడలిజం నశించాలి.. ఓట్ల విప్లవం వర్ధిల్లాలి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడలంటూ ప్రజాయుద్ధనౌక గద్దర్ ఆటాపాటా ఆకట్టుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరిఖని జూనియర్ కళాశాల గ్రౌండ్ సోమవారం ఏర్పాటు చేసిన సభలో మహాకూటమి అభ్యర్థి రాజ్‌ఠాగూర్ మక్కాన్‌సింగ్ తరఫున ఆయన ప్రచారం చేశారు. చిన్నారులతో కలిసి గతంలో జరిగిన అన్యాయాలను నాటిక రూపంలో వివరించారు. గిరిజనులకు రిజర్వేషన్లు ఇస్తామని గత ప్రభుత్వం మోసం చేసిందని.. జనాభలో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ ఉండగా టీఆర్ఎస్ పార్టీలో మంత్రి పదవి ఒక్కరికి కూడా దక్కలేదని విమర్శించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని బిర్యాని పెట్టి బుజ్జగించారన్నారు. గొర్రెలు, తోకలు, ఈకెలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి పదవి మాత్రం బీసీలకు ఇవ్వకుండా తన దగ్గరే పెట్టుకున్నారని అన్నారు. సింగరేణిలో కారుణ్య నియామకాల పేరుతో కారుణ్యం లేకుండా కఠినత్వంగా వ్యవహరించారని పేర్కొన్నారు. రామగుండం ఉద్యమ గుండం, వెలుగు గుండాన్ని ప్రస్తుతం చీకటి మయం చేశారని విమర్శించారు. మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్‌ఠాగూర్‌మక్కాన్‌సింగ్ మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్ల కాలంలో ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. ఇచ్చిన హామీలు విస్మరించి ప్రజలను మోసం చేశారన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు కాల్వ లింగస్వామి, హర్కర వేణుగోపాల్, కౌశిక్‌హరి, బాబర్ సలీంపాషా, గుమ్మడి కుమారస్వామి, జీవీరాజు, విజయ్, జిమ్మిబాబు, అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు. -
ఫాంహౌస్‌కు సరే... మా పొలాలకు నీళ్లొద్దా?
- ఎల్లంపల్లి మిగులు భూములకు నీళ్లివ్వాల్సిందే - శాప్ మాజీ చైర్మన్ మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ సాక్షి, పెద్దపల్లి: ఎర్రవెల్లిలోని సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌కు ఎల్లంపల్లి నుంచి నీళ్లు చేరుతున్నాయని, ప్రాజెక్ట్ కోసం భూములు త్యాగం చేసిన రైతుల మిగులు భూములు మాత్రం ఎండుతున్నాయని శాప్ మాజీ చైర్మన్ మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ మండి పడ్డారు. ఎల్లంపల్లి భూనిర్వాసితుల మిగులు భూములకు సాగునీళ్లందే వరకు పోరాటాన్ని ఆపేది లేదని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్వాసితుల మిగులు భూములకు సాగు నీరివ్వాలని డిమాండ్ చేస్తూ మక్కాన్‌సింగ్ పాదయాత్ర చేపట్టారు. రామగుండం నియోజకవర్గంలోని 16 గ్రామాల గుండా 35 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగింది. శుక్రవారం పాద యాత్ర ముగింపు సందర్భంగా పెద్దపల్లికి భారీ ర్యాలీతో వచ్చిన ఆయన జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎస్.ప్రభాకర్‌రెడ్డికి వినతిపత్రం అందచేశారు. దివంగత ముఖ్య మంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి దూరదృష్టితోనే ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారని మక్కాన్‌సింగ్ అన్నారు. తమ విజ్ఞప్తి మేరకు వైఎస్సార్ ఆదేశంతో స్థానికంగా సాగు, తాగునీరందించేందుకు సుమారు రూ.80 కోట్లతో బండలవాగు, బుగ్గ వద్ద చెక్‌డ్యాం నిర్మించాలని నిర్ణయించారన్నారు.