తొమ్మిదేళ్లలో అభివృద్ధి శూన్యం | There is No Development From Nine Years | Sakshi
Sakshi News home page

తొమ్మిదేళ్లలో అభివృద్ధి శూన్యం

Published Fri, Nov 23 2018 4:38 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

There is No Development From Nine Years - Sakshi

ఆశీర్వాదం తీసుకుంటున్న మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌

గోదావరిఖని : కాంగ్రెస్‌ పార్టీతో రామగుండం నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే అభ్యర్థి మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. గురువారం స్థానిక సిరి ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రైస్తవుల ప్రార్థనలతో ఆశీర్వాదం పొందారు. క్రైస్తవులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు జిమ్మి బాబు, ఫాస్టర్లు జాన్‌సుందర్, జీవరత్నం, ఎలియాస్, ఐజయ్య, నాయకులు జేవీ రాజు పాల్గొన్నారు. పోచమ్మ మైదానంలో కార్పొరేషన్‌లో పని చేస్తున్న కార్మికులను ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో జీడీకే1వ గనిపై కార్మికులను కలిసి ఓటు అభ్యర్థించారు. ఓల్ట్‌ అశోక్‌ లేబర్‌ అడ్డా వద్ద కార్మికులను కలిసి కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను వివరించారు. ఎల్‌ఐసీ కార్యాలయంలో ఉద్యోగులను కలిసి ఓటు వేయాలని కోరారు. వేర్వేరుగా జరిగినకార్యక్రమాలలో నాయకులు కాల్వ లింగస్వామి, బడికెల రాజలింగం, మహంకాళి స్వామి, గుమ్మడి కుమారస్వామి, ఎం.రవికుమార్, తిప్పారపు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.  

కేశోరాంలో ఎన్నికల ప్రచారం
పాలకుర్తి: బసంత్‌నగర్‌ కేశోరాం సిమెంట్‌ కర్మాగారంలో గురువారం మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్, కేశోరాం కార్మికసంఘం అధ్యక్షుడు కౌశికహరితో కలిసి గేట్‌మీటింగ్‌ నిర్వహించారు. కార్మికులనుద్దేశించి మాట్లాడుతూ... గడిచిన తొమ్మిదేళ్లలో సోమారపు సత్యనారాయణ హయాంలో నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. రామగుండం అభివృద్ధి కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని, కాంగ్రెస్‌పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.  కార్మికసంఘం ప్రధాన కార్యదర్శి తోడేటి రవికుమార్‌తో పాటు వివిధ గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు. 

అభ్యర్థులంతా నాన్‌ లోకల్‌...
రామగుండం: రామగుండం అసెంబ్లీ బరిలో ఉన్న నాయకులందరు స్థానికేతరులేనని, స్థానికులను గుర్తించి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని మక్కాన్‌సింగ్‌ఠాకూర్‌ అన్నారు. స్థానిక అభ్యర్థిని ఆదరించి వన్‌సైడ్‌ ఓటింగ్‌తో చరిత్ర సృష్టించాలన్నారు. గురువారం పట్టణంలోని కౌశిక హరి నివాసంలో ప్రచార సరళిపై నియోజకవర్గ పరి ధిలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో చర్చించారు.  సమావేశంలో  కేశోరాం కార్మిక సంఘం నాయకుడు కౌశిక హరి, మాజీ ఎంపీపీ బర్పటి కిష్టయ్య, పూదరి సత్తయ్యగౌడ్, ఉరిమెట్ల రాజలింగం, ఇసంపెల్లి అంజులు, గడ్డం శంకర్, గోలివాడ ప్రసన్నకుమార్, మేర్గు పోశం, రామ్‌నాయక్, సూరతార, చల్ల రవీందర్‌రెడ్డి, కేశవరెడ్డిలున్నారు.

పతి గెలుపునకు సతి ప్రచారం
జ్యోతినగర్‌: పతి గెలుపు కోసం సతి ప్రచారం చేపట్టారు. రామగుండం అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజ్‌ ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌ గెలుపు కోసం ఆయన సతీమణి ప్రసన్న మనాలి ఠాకూర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. న్యూపీకే రామయ్యకాలనీ, అన్నపూర్ణకాలనీ, కృష్ణానగర్‌ ప్రచారంలో కార్పోరేటర్‌ దాసరి సావిత్రి, గాదం విజయ, శంకరమ్మ, స్వరూప, రజిత, స్వప్నలతో పాటు ప్రచార కమిటీ కన్వీనర్‌ నెలకంటి రాము పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

  ఎన్నికల ప్రచారంలో ప్రసన్న మనాలి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement