
మాట్లాడుతున్న మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్
సాక్షి, గోదావరిఖని: ఈనెల 7న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు చూపిస్తానని కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ హామీ ఇచ్చారు. బుధవారం గోదావరిఖని రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈనెల 7న జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఫైవింక్లయిన్ మీదుగా తిలక్‌నగర్, జవహర్‌నగర్, లక్ష్మీనగర్, మెయిన్ చౌరస్తా, ఎన్టీపీసీ మీదుగా రామగుండం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే జీఎంకాలనీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్‌సింగ్‌ను గెలిపించాలని గాదం విజయ ఆధ్వర్యంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మక్కాన్‌సింగ్ కూతురు మానసఠాకూర్, నాయకులు పున్నం స్వరూప, భైరి లావణ్య, రజిత, మౌనిక, శ్రీలత, స్వరూప, స్వప్న, తిరుమల, ఈశ్వరమ్మ పాల్గొన్నారు.
జ్యోతినగర్: కాంగ్రెస్ పార్టీ విజయంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రామగుండం అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ అన్నారు. బుధవారం రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టు లేబర్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు పేదలకు అందేవిధంగా మీకు సేవ చేస్తానని ప్రకటించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేలా యాజమాన్యంతో చర్చించనున్నట్లు వెల్లడించారు. చేతి గుర్తుకు ఓటు వేసి గెలించాలని అభ్యర్థించారు. కార్పొరేటర్లు కొలిపాక సుజాత, కవితారెడ్డి, పద్మలత, బాబర్ సలీంపాషా, బండి తిరుపతి, జిమ్మి బాబు, కళ్యాణ్, అరుణ్‌కుమార్, సంపత్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment