ర్యాలీలో పాల్గొన్న గంగుల కమలాకర్
సాక్షి, కొత్తపల్లి: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేసిందని కరీంనగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. కొత్తపల్లి మండలం రేకుర్తిలోని సాలెహ్‌నగర్, హనుమాన్‌నగర్, ద్వారకానగర్, గౌడ కాలనీ, షేకాబీకాలనీల్లో మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్, మాజీ ఉపసర్పంచ్ సుదగోని కృష్ణకుమార్‌గౌడ్‌ల ఆధ్వర్యంలో శుక్రవారం కమలాకర్‌కు డప్పు చప్పుళ్లు, మంగళహారతులు, పూలతో స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ పలు మసీదుల్లో ముస్లింను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఆయా కాలనీల్లో ఏర్పాటు చేసిన సభల్లో గంగుల మాట్లాడుతూ ఐదేళ్లుగా కనిపించని కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఎందుకు పట్టించుకోలేదో నిలదీయాలని కోరారు.
మహాకూటమి రూపంలో చంద్రబాబు తెలంగాణ గడ్డపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తోందని అన్నారు. తెచ్చుకున్న తెలంగాణలో ఆంధ్రా దొంగలు పడేందుకు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కొనసాగాలంటే ఇంటిపార్టీ టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, ఎంపీపీ వాసాల రమేష్, జెడ్పీటీసీ ఎడ్ల శ్రీనివాస్, జెడ్పీ కోఆప్షన్ జమీలొద్దీన్, ఎంపీటీసీ శేఖర్, టీఆర్‌ఎస్‌వీ నాయకుడు పొన్నం అనీల్‌గౌడ్, మాజీ వార్డుసభ్యులు ఎస్.నారాయణగౌడ్, మాజీద్, రహీం, రాచకొండ నరేశ్, పొన్నాల తిరుపతి, అస్తపురం నర్సయ పాల్గొన్నారు.
పలువురి చేరిక
రేకుర్తికి చెందిన కాంగ్రెస్, టీడీపీ సీనియర్ సీనియర్ నాయకులు అస్తపురం అంజయ్య, నెల్లి చంద్ర య్య, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రవీందర్‌లు గంగుల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
నేడు‘ గంగుల’ ప్రచారం
కరీంనగర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ శనివారం సీతారాంపూర్ కాలనీ, కమాన్‌పూర్ గ్రామాల్లో ఉదయం ఇంటింటా ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం కరీంనగర్‌లోని 16, 17, 21 డివిజన్‌లలో ఇంటింటా ప్రచారంతోపాటు గంజ్, టవర్ సర్కిల్ ప్రాంతంలో ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం ఎన్‌ఎన్ గార్డెన్‌లో నిర్వహించే సమావేశానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం మహ్మద్ అలీ హాజరుకానున్నారు.
తెలంగాణ ఆసెంబ్లి ఎన్నికల మరిన్ని వార్తలు..
Comments
Please login to add a commentAdd a comment