swacha India
-
తడి, పొడిపై అవగాహన ఏది?
సాక్షి, కరీంనగర్‌కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలక సంస్థ పరి« దిలో తడి, పొడి చెత్తను వేరు చేయడంపై అవగాహన కరువైంది. కరీంనగర్ నగరపాలక సంస్థలో తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్‌కు తరలించాలనే లక్ష్యం నీరుగారుతోంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా తడి, పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియను పకడ్బందీగా అమలు చేసిన నగరపాలక సంస్థ ఆ తర్వాత పర్యవేక్షణ మరిచింది. తడిచెత్త, పొడి చెత్త రెండూ ఒకే డబ్బాల్లో వేసి రిక్షాలకు ఇస్తున్నారు. స్వచ్ఛభారత్, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా చెత్తను ఎక్కడికక్కడే తగ్గించడానికి అమల్లోకి తీసుకొచ్చిన విధానం స త్ఫలితాలివ్వడం లేదు. ప్రతీ ఇంటికి రెండు డబ్బాలు ఇ చ్చి తడి, పొడి చెత్తను వేరు చేసి రిక్షాలకు ఇవ్వాలని ప్రచా రం చేశారు. రిక్షాల ద్వారా కూడా తడి, పొడి వేరు చేసేం దుకు వాటికి కూడా డబ్బాలను ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. వేరు చేయకపోవడంతో ఇబ్బందులు చెత్తను వేరు చేసేందుకు రెండు రకాల డబ్బాలు ఇచ్చినప్పటికీ ప్రజల నుంచి స్పందన రావడం లేదు. తడి, పొడి చెత్తను ఒకే డబ్బాలో వేసి రిక్షాలకు ఇస్తున్నారు. దీంతో గతంలో మాదిరిగానే చెత్త డంప్‌యార్డుకు చేరుతుంది. దీంతో డంపింగ్‌యార్డు పూర్తిగా నిండింది. ఇటీవల పలుమార్లు అగ్నిప్రమాదం జరిగి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తడి, పొడి చెత్తను వేరుచేయడం ద్వారా డంప్‌యార్డుకు చెత్తను తగ్గించే అవకాశం ఉంది. తడి చెత్తను వర్మీ కంపోస్టు యార్డుకు తరలించడం, పొడి చెత్తను పాత సామగ్రి కింద కా>ర్మికులు అమ్ముకునే అవకాశం కల్పించారు. ఇదంతా చెత్త సేకరణ సమయంలోనే చేయడం ద్వారా డంప్‌యార్డుకు చెత్త తగ్గుతోంది. తడి, పొడి ఒకే డబ్బాలో.. నగరంలోని కొన్ని డివిజన్లలో ప్రయోగాత్మకంగా తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించడానికి రిక్షాలకు డబ్బాలు అమర్చారు. ఇంటి యజమానుల దగ్గర ఉన్న వేర్వేరు డబ్బాల్లో తడి, పొడి చెత్తను వేసి రిక్షాల్లో ఉన్న డబ్బాలలోనే తడి, పొడి చెత్తను వేయాల్సి ఉంటుంది. తడి, పొడి చెత్త సేకరణకు నగరపాలక సంస్థ అన్ని డివిజన్లకు డబ్బాలు పంపిణీ చేశారు. ఒక్కొక్క డబ్బాకు రూ.120 ఖర్చుచేసి ఇస్తుండగా ఇంటి యజమానులు తడి, పొడి చెత్త వేరుచేసి ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో స్వచ్ఛసర్వేక్షణ్ లక్ష్యం నీరుగారిపోతుంది. ఇప్పటికైనా అధికారులు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించి వేర్వేరుగా సేకరిస్తే డంప్‌యార్డుకు చెత్తను తగ్గించే అవకాశం ఉంది. -
‘స్వచ్ఛ’పై నలు‘దిశ’లా ప్రచారం
మహబూబాబాద్ టౌన్ : పరిశుభ్రతతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్రమోదీ అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిం చారు. దీనిపై ఊరూరా అవగాహన కల్పించడానికి మహబూబాబాద్‌కు చెందిన దిశ సామాజిక సేవా సంస్థ సెప్టెంబర్ 30వ తేదీ నుంచి కరపత్రాలు, స్టిక్కర్లు, పోస్టర్లు ముద్రించి విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో సైతం ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా దిశ వ్యవస్థాపక అధ్యక్షుడు వి.గురునాథరావు ‘సాక్షి’తో మాట్లాడారు. జాతీయ, అంతర్జాతీయ నివేదికల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 69 శాతం మరుగుదొడ్లు లేవని, సుమారు 30 శాతం పట్టణాల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు. యూనిసెఫ్ నివేదిక ప్రకారం దేశంలో శిశు మరణాలు శుభ్రత లేకపోవడంతోనే సంభవిస్తున్నట్లు తెలిపిందన్నారు. ఇటీవల జాతీయ క్రైం నివేదిక ప్రకారం మహిళలు, బాలికలపై జరిగే లైంగిక దాడులు చాలా వరకు బహిర్భూమికి వెళ్లిన సందర్భాల్లోనే జరిగాయని తెలపడం చాలా ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ‘నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు.. మరి ఊరు బాగుంటే మనమంతా బాగుంటాం.. పెద్దలు ఆరోగ్యంగా ఉండగలుగుతారు.. భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుంది’ అని తెలిపారు. ఇలా గ్రామీణ యువతలో స్వచ్ఛ భారత్‌పై చైతన్యం కలిగించేందుకు దిశ సంస్థ కృషి చేస్తుందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి దాదాపు ఏడు దశాబ్దాలు సమీపిస్తున్న తరుణంలో సరైన నిర్ణయం తీసుకుని కేంద్రం చిత్తశుద్ధితో స్వచ్ఛ భారత్‌ను నిర్వహించడం అభినందనీయమన్నారు. దీనికి ప్రజల సహకారం కావాలని ఆయన కోరారు. -
‘నగరం’ విస్ఫోటంతో 240 కోట్ల ఆదాయానికి గండి
సాక్షి, రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామం వద్ద గెయిల్ గ్యాస్‌పైప్ లైన్ విస్ఫోటం నేపథ్యంలో.. బావులను మూసివేయడం తదితర కారణాల వల్ల తమ సంస్థ ఆదాయానికి రూ.240 కోట్ల మేర గండి పడిందని ఓఎన్జీసీ సీఎండీ డీకే షరాఫ్ తెలిపారు. ఈ ప్రమాదంలో వాటిల్లిన ఆర్థిక నష్టంకన్నా ప్రాణాతలు పోవడమే తమకు చాలా బాధ కలిగిస్తోందన్నారు. ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని రాజమండ్రి ఓఎన్జీసీ కార్యాలయంలో షరాఫ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గోల్ఫ్ కోర్ట ప్రాంతంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరం పేలుడు అనంతరం బలహీనంగా ఉన్న పైప్లైన్ల మార్పును వేగవంతం చేశామని షరాఫ్ చెప్పారు. కేజీ బేసిన్లో మొత్తం 860 కిలో మీటర్ల పైప్లైన్లు ఉండగా అందులో ఇప్పటికే 50 శాతం మార్పు చేసినట్లు తెలిపారు. ఆఫ్‌షోర్, ఆన్‌షోర్‌ల్లో ఉత్పత్తికి సన్నాహాలు ఆఫ్‌షోర్‌లో కాకినాడ నుంచి సముద్రంలో 65 కిలోమీటర్ల దూరంలో డి-6 బావి సమీపంలో ఉన్న కేజీ 98/2 బావి నుంచి 2018 నాటికి చమురు ఉత్పత్తి ప్రారంభించేందుకు కార్యాచరణ సిద్ధమైందని షరాఫ్ అన్నారు. ఇక్కడ నుంచి 2021లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని భావించామని, కానీ ముందుగానే ప్రారంభించేందుకు ఎక్స్పర్ట్ అసెట్ మేనేజర్ ప్రతిపాదించారని తెలిపారు. ఓఎన్జీసీ 51 శాతం, కెయిర్న్ ఇండియా 49 శాతం భాగస్వామ్యంతో ఆన్‌షోర్‌లో 2017నాటికి నాగాయలంక వద్ద సహజ వాయువు ఉత్పత్తికి యత్నిస్తున్నామన్నారు. ఈ ప్లాంట్ నుంచి 2019 నాటికి పూర్తిస్థాయి ఉత్పత్తి జరిగే అవకాశాలు ఉన్నాయని, ఇందుకు ఆ ప్రాంతంలో క్షేత్రస్థాయి అభివృద్ధి ప్రణాళికలు సిద్ధమయ్యాయని చెప్పారు. ఓఎన్జీసీ ద్వారా ప్రస్తుతం సుమారు 3 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి అవుతోందన్నారు. ‘స్వచ్ఛ భారత్’లో భాగంగా దేశవ్యాప్తంగా బాలికల పాఠశాలల్లో రూ.100.85 కోట్లతో 2,500 మరుగుదొడ్లు నిర్మిస్తున్నామన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో జిల్లాకు 12 చొప్పున ఈ మరుగుదొడ్లు నిర్మిస్తామన్నారు. విలేకర్ల సమావేశంలో సమావేశంలో ఆన్‌షోర్ డెరైక్టర్ అశోక్‌వర్మ, రాజమండ్రి అసెట్ మేనేజర్ దేబశిష్ సన్యాల్ పాల్గొన్నారు.