![ఖమ్మంలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన](/styles/webp/s3/article_images/2017/09/4/51468551790_625x300.jpg.webp?itok=oy3kl1sr)
ఖమ్మంలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులు మరోసారి ఆందోళన బాట పట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఖమ్మం కార్పొరేషన్ ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో సుమారు 300 మంది పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళనలు కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు.